పార్నపల్లె గ్రామంలో మట్టి మిద్దె కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. గ్రామానికి చెందిన దూదేకుల నడిపి హుసేన్ మట్టి మిద్దెలో నివసిస్తున్నాడు. సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఇంట్లో ఉన్న అతని తల్లి కాశీంబీ(65)తో మాట్లాడేందుకు పక్క ఇంట్లో ఉంటున్న (ఆమెకు మనుమరాలి వరుస అయ్యే) సలీమాబీ(40) వచ్చింది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కాశీంబీ పెద్ద కుమారుడైన పెద్ద హుసేని భార్య హుసేనమ్మ, మరొ కోడలు చిన్న హుసేనమ్మతో పాటు మనువళ్లు కూడా ఉన్నారు.