కొత్త కరెన్సీని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అసెంబ్లీలో జరిగిన చర్చలో జానారెడ్డి మాట్లాడుతూ.. నగదు అందుబాటులో లేక పెళ్లిళ్లు ఆగిపోయానని చెప్పారు.