కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కరెన్సీ కొరత వల్ల ప్రజలు పడుతున్న సమస్యలను ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చిల్లర కొరత తీర్చాలని ఆర్బీఐకి లేఖ రాసినట్టు తెలిపారు