ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే నంబర్ వన్ విలన్ అని అభివర్ణించారు. తెలంగాణ వినాశనానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ ఇక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుందని ధ్వజమెత్తారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ సభ్యత్వాలపై వేటు నేపథ్యంలో సీఎం కేసీఆర్ బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు.