రాష్ట్రంలో అరాచక శక్తులు ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు అన్ని చూస్తున్నారని, అంతిమంగా వారే న్యాయ నిర్ణేతలని పేర్కొన్నారు. మంగళవారం సస్పెన్షన్ తర్వాత కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి బయటికి వెళ్లిన అనంతరం సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రసంగం సమయంలో జరిగిన ఘటన బాధాకరం, దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు మన అసెంబ్లీలో వస్తాయని ఊహించలేదు. నిర్ణయం కఠినతరమేగానీ తప్పదు.