ఓటింగ్‌ ముగిసింది.. ఇక లెక్కింపే | Vice-Presidential election closed, results may declare at 7PM | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 5 2017 5:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM

దేశంలో రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటలకు పార్లమెంట్‌ ఆవరణలో మొదలైన ఈ ఓటింగ్‌ ప్రక్రియ, సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 781 ఓట్లలో 771 ఓట్లు పోలయ్యాయి. వెంటనే పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఫలితాలు రాత్రి 7 గంటల వరకు వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు కొనసాగుతున్న హమీద్‌ అన్సారీ పదవీకాలం ఈ నెల 10తో ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అనివార్యమైంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement