అమెరికా అందాల పోటీల్లో ప్రవాస తెలుగు యువతి, మిస్ న్యూయార్క్ నీనా దావులూరి(24) మెరిసింది. మిస్ అమెరికా అందాల పోటీలో విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. యువతి మిస్ అమెరికా కిరీటాన్ని దక్కించుకున్న తొలి ప్రవాస భారతీయ యువతిగా ఆమె నిలిచింది. మిస్ న్యూయార్క్గా ఎంపిక రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. అట్లాంటా నగరంలో నిర్వహించిన పోటీలో 15 సెమీ ఫైనలిస్టులను వెనక్కు నెట్టి ఆమె మిస్ అమెరికా కిరీటాన్ని అందుకుంది. బ్రాడ్వాక్ హాలు జరిగిన ఈ పోటీని అమెరికా అంతటా టీవీలో ప్రసారం చేశారు. అంతకుముందు ఈ టైటిల్ అందుకున్న మాజీ మిస్ న్యూయార్క్ మాలోరి హాగన్.. నీనాకు కిరీటం అలంకరిచింది. విజేతగా నిలిచిన నీనాకు 50 వేల డాలర్లు ఉపకార వేతనంగా అందుతాయి. టాలెంట్ విభాగంలో ఆమె చేసిన 'బాలీవుడ్' డాన్స్ అలరించింది. ప్లాస్టిక్ సర్జరీపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం జడ్జిలను ఆకట్టుకుంది. ప్లాస్టిక్ సర్జరీ తాను వ్యతిరేకమని, జన్మతః వచ్చిన అందంతో పాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె సమాధానం చెప్పింది. తన తండ్రిలాగే తాను కూడా డాక్టర్ కావాలనుకుంటున్నట్టు చెప్పింది. నీనా దావులూరి తల్లిదండ్రులు స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన వారు.