తనకు తెలియకుండానే తన జన్‌ధన్∙ఖాతాలోకి వంద కోట్ల రూపాయలు వచ్చి చేరాయంటూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఘజియాబాద్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేసే మహిళ కొన్ని రోజుల క్రితం కొంత నగదును విత్‌డ్రా చేసేందుకు స్థానిక ఏటీఎంకు వెళ్లింది.