దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అసెంబ్లీ లాంజ్‌లో తొలగించిన చోటే పునరుద్ధరించే విషయంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం కోడెలను కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైఎస్ సహా తొలగింపునకు గురైన దామోదరం సంజీవయ్య, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు ఫొటోలనూ యథాస్థానంలో ఉంచాలని గట్టిగా పట్టుపట్టారు