రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిగా అవినీతిలో మునిగిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గౌతంరెడ్డి ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...బాబు పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆంధ్రా నయీంగా నారా లోకేశ్ తయారయ్యాడని గౌతంరెడ్డి దుయ్యబెట్టారు. ప్రతి పనిలోనూ కూడా ఆయనకు ముడుపులు ముట్టచెప్పాల్సిందేనన్నారు. రూ.కోట్లు ఎలా సంపాదించాలన్న దానిపైనే టీడీపీ వర్క్షాప్ జరిగిందని ఎద్దేవా చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ వర్క్ షాప్లో ఒక్కో ఎమ్మెల్యే రూ.40 నుంచి 50 కోట్లు సంపాదించాలని బాబు సూచించారన్నారు. అవినీతిలో కోట్ల రూపాయలు సంపాదించిన వారికే 'ఏ' గ్రేడ్ ర్యాంకులిచ్చారని గౌతంరెడ్డి అన్నారు.