Top Stories
ప్రధాన వార్తలు

మంత్రి నారా లోకేష్‌పై బొత్స ఆగ్రహం
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై చర్చలో వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ వరుద కళ్యాణి ప్రసంగాన్నిఅడ్డుకునేందుకు మంత్రులు ప్రయత్నించారు. ఆమె ప్రసంగాన్ని మంత్రి నారా లోకేష్ అడ్డుకున్నారు. నాలుగు లక్షల ఉద్యోగాలు చెప్పలేదంటూ మంత్రి నారా లోకేష్ వాదించారు. గవర్నర్ ప్రసంగంలో కల్పించినట్టు రాశారని వరుదు కళ్యాణి అన్నారు. తాము ఇంగ్లీష్ స్పీచ్‌లో ఉన్నదే చెప్తామంటూ మంత్రి లోకేష్ వితండ వాదం చేశారు.మంత్రులు మాటిమాటికీ అడ్డు తగలడంపై విపక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల తీరుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చేశాం అని ఎలా చెప్తారంటూ బొత్స అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ, జనసేన పై ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేదన్న వరుదు కళ్యాణి వ్యాఖ్యల పట్ల మంత్రి నారా లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు.మేం కేంద్రానికి బేషరతుగా మద్దతు ఇచ్చాం.. మా మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడిందని ఏనాడూ అనలేదంటూ మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేంద్రంలో ఉన్నది వీళ్ల ఉమ్మడి ప్రభుత్వం కాదా..?. మా మీద ఆధారపడలేదని చెప్తారా..?. రాష్ట్ర ప్రయోజనాల కోసమన్నారు. అదే మా సభ్యురాలు చెప్తున్నది. 2014 నుండి 2019 మధ్యలో ప్యాకేజీ కోసం హోదాను వదిలేయలేదా..?’’ అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు పాలన గొప్పలు చెప్పుకుంటున్నారు.. కానీ ఓటేసిన జనం చెప్పులతో కొట్టుకుంటున్నారు. తొమ్మిది నెలల్లో రైతులు, మహిళలు, పేదల జీవితాలు తలకిందులైపోయాయి. సూపర్ 6 పథకాలకు ఎగనామం పెట్టడం సుపరిపాలనా..?. ఉద్యోగులకు డీఏ, ఐ ఆర్, పీ ఆర్ సీ ఇవ్వకపోవడమే సుపరిపాలనా..?. అమ్మ ఒడి, రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన అవుతుందా.?’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు.‘‘రూ.15 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారు. 60 శాతం నిత్యవసర వస్తువులు ధరలు పెంచారు. 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేశాం అని చెప్పారు..ఎక్కడ ఇచ్చారు..? చూపించండి. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ జగన్ 6 నెలల్లో లక్షా 25 వేల ఉద్యోగాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం.. తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీని కూడా పూర్తి చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ఇవ్వకుండా మోసం చేశారు. టీడీపీ పై ఆధారపడ్డ కేంద్ర ప్రభుత్వం ఉన్నా ప్రత్యేక హోదాను సాధించలేదు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూకుడు నిర్ణయాలతో ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్ తగ్గుతోందా..? ఆయన విధానాలతో అగ్ర దేశ ప్రజలు అంత సంతోషంగా లేరా..? అంటే తాజాగా వెల్లడైన పాపులర్ పోల్ సర్వే ఫలితాలు అవునేనే చెబుతున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగిసిన రాయిటర్స్/ఇప్సోస్ తాజా పోల్‌లో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్‌లో కంటే ట్రంప్‌కు మద్దతు పలికేవారి సంఖ్య కాస్త తగ్గింది. జనవరిలో వరుసగా ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది 44 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10 శాతం పెరిగి 51 శాతానికి చేరింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌ను కేవలం 41 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా 47 శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకెళుతున్నారని ఏకంగా 53 శాతం మంది భావిస్తున్నారు.జనవరిలో ట్రంప్ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు, ఇతర ఆర్థిక విధానాలను కేవలం 39 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు. ఇదే గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిన అంశం. అయితే రెండో టర్ము మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చైనాపై టారిఫ్‌ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు లభించింది. చైనాపై టారిఫ్‌లను కూడా 47 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం. రాయిటర్స్,ఇప్సోస్ నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు.

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
అమరావతి, సాక్షి: ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే దక్కాలని బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ లాయర్ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) అంటున్నారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై ఆయన కోర్టుకెక్కారు. ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు.‘‘తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా. నేను వేసిన పిల్ మార్చి 12వ తేదీన విచారణకు వస్తుంది’’ అని మీడియాకు తెలిపారాయన. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారాయన. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే.. దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయడ్డారు.ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీదేఏపీలో ప్రతిపక్షంలో ఒక్క వైఎస్సార్సీపీ(YSRCP)నే ఉంది. కాబట్టి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష(Principal Opposition) హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదు. అసెంబ్లీలో తక్కువ మంది ఎమ్యెల్యేలు ఉన్నా వైఎస్సార్సీపీకి ఆ హోదా దక్కాల్సిందే అని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో ఆయన మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 👉తిరుపతి లడ్డూ అంశం(Tirupati Laddu Controversy) ముగిసిపోయింది. కల్తీలాంటి అంశాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుపతి లడ్డూను కల్తీ చేయాలని నిజమైన భక్తులు ఎవరూ అనుకోరు. 👉మంచి విషయం ఎవరు చెప్పినా పార్టీలకతీతంగా అంగీకరించాలి. నా నిర్ణయాలను పార్టీ ఎన్నడూ వ్యతిరేకించలేదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Prabhutvam)లో బీజేపీ భాగమై ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీసే అవకాశం లేకపోలేదు.

Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది. మహా కుంభమేళా చివరి అమృత స్నానంలో కోటి మందికి పైగా భక్తులు పాల్గొంటారని స్థానిక అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత రీతిలో భద్రతా ఏర్పాట్లు చేసింది.జనవరి 13న మహా కుంభమేళా(Maha Kumbh) ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకు దాదాపు 64 కోట్ల మంది భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. రైళ్లు, విమానాలు, రోడ్డు మార్గాలలో కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. శివరాత్రి( Mahashivratri) సందర్భంగా పవిత్ర స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు నగరంలోనికి ఎటువంటి వాహనాలను అనుమతించరు. అయితే వాటి పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు.ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే అన్ని ప్రధాన రహదారులలో మోటార్‌బైక్‌లపై 40 పోలీసు బృందాలను మోహరించారు. కుంభమేళా చివరి రోజు మహాశివరాత్రి ఒకరోజు అయినందున ప్రయాగ్‌రాజ్‌లోని శివాలయాలను సందర్శించేందుకు భక్తులకు అనుమతినివ్వనున్నారు. ఆయా శివాలయాలలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇప్పుటికే అదనపు పోలీసు సిబ్బందిని నియమించారు. కాగా మహా కుంభమేళా ప్రారంభంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP Chief Minister Yogi Adityanath) ఈ కార్యక్రమానికి 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేశారు. ఈ సంఖ్య ఫిబ్రవరి 11 నాటికే నమోదయ్యింది. తరువాతి మూడు రోజుల్లో ఆ సంఖ్య 50 కోట్లు దాటింది. తాజాగా.. 60 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన జీవన్మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’

ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'తండేల్'. ఈ నెల 7న థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ తెచ్చుకుని రూ.100 కోట్ల కలెక్షన్స్ మార్క్ కూడా అందుకుంది. తాజాగా టీమ్ అంతా కలిసి సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు. తండేల్ మూవీ రిలీజ్ రోజే పైరసీకి గురైంది. దీనిపై నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికి థియేటర్లలో సినిమా రన్ అవుతోంది. కానీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ పై బజ్ వినిపిస్తోంది. అనుకున్న టైం కంటే ముందే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.(ఇదీ చదవండి: సింగర్ పై 19 ఏళ్ల తర్వాత మరో కేసు పెట్టిన మొదటి భార్య!)తండేల్ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో 'పుష్ప 2' తప్పితే చాలా సినిమాల్ని ఈ ఓటీటీ సంస్థ.. నెల రోజులకు అటు ఇటుగా స్ట్రీమింగ్ చేసేస్తోంది. అలానే ఈ సినిమాని కూడా నెలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మార్చి 6 నుంచే తండేల్.. ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లేదంటే మార్చి 14న రావొచ్చని మాట్లాడుకుంటున్నారు.తండేల్ విషయానికొస్తే.. శ్రీకాకుళంలోని మత్సలేశం అనే ఊరికి చెందిన కొందరు జాలర్లు.. గుజరాత్ తీరంలో చేపలు పడుతుండగా, అనుకోకుంగా పాకిస్థాన్ నేవి చేతికి చిక్కారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. తర్వాత పాకిస్థాన్ జైల్లో కొన్నాళ్ల పాటు ఉన్నారు. భారత ప్రభుత్వం జోక్యంతో తిరిగి ఇళ్లకు చేరారు. ఈ స్టోరీకి ప్రేమకథని జోడించిన డైరెక్టర్ చందూ మొండేటి.. తండేల్ తీశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)

చంద్రబాబు జస్ట్ బిల్డప్ బాబాయ్ అంతే!
విపక్షంలో ఉన్నప్పుడు.. నోటికొచ్చిన ఆరోపణలు చేయడం, అధికారంలోకి వస్తే.. ఎక్కడా లేని నీతులు చెప్పడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ విద్యలో ఆరితేరారు. దానికి బిల్డప్ బాబాయిలుగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి.. లాంటి ఎల్లో మీడియా భజన ఎటూ ఉంటుంది. ఈమధ్య.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) గుంటూరు మిర్చియార్డులో రైతులను పరామర్శించడానికి వెళ్లారు. గిట్టుబాటు ధరలు రాక రైతులు విలవిలలాడుతున్న తరుణంలో జగన్ అక్కడకు వెళితే.. ఆ పర్యటనను చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నారు!. రైతులు కష్టాలలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకాని, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాని పరామర్శ చేసి.. వారిని ఆదుకోవడానికి ఏ చర్యలు తీసుకునేది చెప్పలేదు. పైగా జగనే ఏదో తప్పు చేశాడని చంద్రబాబు పదే పదే అంటున్నారు. శాసనమండలి గ్రాడ్యుయేట్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయట!. కోడ్ అమలులోకి వచ్చిందట!. అందుకే రైతులను ఎవరూ పలకరించి వారి కన్నీరు తుడవరాదట!. రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలట!. ఏమైనా అర్ధం ఉందా?.. అసలు మిర్చియార్డులో పడిగాపులు పడుతున్న రైతుల వద్దకు ఎవరూ వెళ్లరాదని ఎన్నికల కమిషన్ ఎక్కడైనా చెప్పిందా?. విచిత్రం ఏంటంటే.. ఇదే ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రిగా ఉండి 2019లో చంద్రబాబు(Chandrababu) ఎన్ని విమర్శలు చేశారో తెలియదా?. ఏకంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఛాంబర్‌కు వెళ్లి దబాయించి గొడవ చేశారు. మరి ఇప్పుడేమో సుద్దులు చెబుతున్నారు. కరోనా సమయంలో ర్యాలీల మాదిరి వెళ్లవద్దని, సభలు జరపవద్దని దేశ వ్యాప్తంగా నిబంధనలు వస్తేనే పట్టించుకోని పెద్దమనిషి చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు శాంతిభద్రత ల సమస్యలు వస్తాయని ,ఫలానా చోటకు వెళ్లవద్దని పోలీసులు వారించినా, వారిని తోసుకుని మరీ వెళ్లిన చరిత్ర చంద్రబాబుది. 👉అనపర్తి వద్ద అప్పట్లో ఏమి చేశారో గుర్తు లేదేమో!. మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద వైఎస్సార్సీపీవాళ్లను చూపిస్తూ.. తన్నండి.. అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. అధికారంలోకి రాగానే ఫిర్యాదుదారుని బెదిరించి ఆ కేసు లేకుండా చేసుకోవడానికి ప్రయత్నించిన చంద్రబాబు చట్టం గురించి చెబుతున్నారు. 👉పుంగనూరు వద్ద తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు పోలీసుల వ్యాన్‌ను తగలబెట్టి, రాళ్లతో పోలీసులపై దాడి చేస్తే ఒక కానిస్టేబుల్ కన్నుపోయింది. ఆ ఘటనలో కనీసం సానుభూతి తెలపని చంద్రబాబు.. ముఖ్యమంత్రి కాగానే ఎక్కడాలేని చట్టాలు, నీతులు చెబుతుంటారు. పోనీ ఆయన ఏమైనా కోడ్ ఉందని ఏ కార్యక్రమం ప్రచారం చేయకుండా ఉంటున్నారా?. విజయవాడలో ఏకంగా మ్యూజిక్ నైట్ పెట్టుకుని ఎంజాయ్ చేశారే! అప్పుడు కోడ్ అడ్డం రాలేదా? రైతులను పరామర్శ చేస్తేనే కోడ్ వచ్చిందా?.. .. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లినందుకు జగన్‌తో సహా ఎనిమిదిమందిపై కేసులు పెట్టారు. మరి అక్కడలేని మాజీ మంత్రి పేర్నినానిపై కూడా కేసు పెట్టాలని ఏ చట్టం చెబుతోంది?. మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ వెళితే భద్రత కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత కాదా?. అయితే సీఎంగా ఉండి ఏ మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాకుండా.. ఎదురు ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లుతుంది మరి. ఆయన మరికొన్ని చిత్రమైన ప్రకటనలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రైతులకు ఏమీ చేయలేదట..! రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదట. ఇంతకన్నా పచ్చి అబద్దాలు ఏమైనా ఉంటాయా?. రైతుల కోసం ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్ర వ్యవస్థను తెచ్చి వాటి ద్వారా వాళ్లకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు పంటల సలహలు, పంట కొనుగోళ్లు.. అన్నీ చేసిందే జగన్. అలాంటి నాయకుడిపై ఇలాంటి విమర్శ చేయడానికి చంద్రబాబు మనసు ఎలా వచ్చిందో అర్ధం కాదు. గతంలో ఎరువుల షాపుల వద్ద రైతులు తమ చెప్పులు క్యూలలో ఎట్టుకుని పడిగాపులు పడి ఉండవలసి వచ్చేది. ఆ పరిస్థితిని తప్పించి రైతులకు గౌరవం తెచ్చిన వ్యక్తి జగన్. దేశంలోనే మొదటిసారిగా రైతులకు పెట్టుబడి సాయం పధకాన్ని ప్రకటించిన రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీల్లా హామీలను ఎగ్గొట్టకుండా.. దానిని అమలు చేసి చూపారాయన. ఏడాదికి రూ13,500 చొప్పున సాయం అందించడం ఒక ఎత్తు అయితే.. ఆయా పంటల ధరల స్థిరీకరణకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది జగన్ కాదా?టమోటా తదితర పంటలకు ధర తగ్గినప్పుడు వెంటనే జోక్యం చేసుకుని మార్కెట్ పెంచింది జగన్ ప్రభుత్వం కాదా?ఇప్పుడేమో కనీసం రైతులను పలకరించని చంద్రబాబేమో.. చాలా చేసేస్తున్నారని ఎల్లో మీడియా బిల్డప్ ఇస్తే సరిపోతుందా?పాపం!గత ఏడాది 21 వేల నుంచి 27 వేల రూపాయల వరకు మిర్చి ధర పలికితే ,ఈసారి అందులో సగం కూడా ఇప్పుడు రావడం లేదని రైతుల ఆక్రోశం. కేంద్రం కూడా దీనిపై తూతూమంత్రంగా వ్యవహరిస్తోంది. అయినా మిర్చి రైతులకు ఊరట అని ఈనాడు బిల్డప్. అవును డబ్బులు ఊరికే రావు.. అన్నట్లుగా ఈనాడుకు చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో లాభం ఉంటోంది కదా!👉కొందరు రైతులు ఇప్పుడు ఓపెన్‌గానే చెబుతున్నారు.. 20వేల రూపాయల పెట్టుబడిసాయం ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేస్తే నమ్మి ఓట్లు వేశామని.. తీరా చూస్తే ఇరవై రూపాయలు కూడా ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు విజయ్ కేసరి చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. 👉పవన్ కల్యాణ్ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం కోసం ఎంతలా మాట్లాడారు?. సినిమా నిర్మాణానికి పెట్టుబడి ఎలా పెరిగింది?.. తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. దానికి చంద్రబాబు కూడా మద్దతు ఇచ్చారు. ఈ పాయింట్‌నే విజయ్ కేసరి ప్రముఖంగా ప్రస్తావించారు 👉సినిమా టిక్కెట్ల ధరలు , మద్యం ధరలు పెంచుకోవడానికి చూపిన శ్రద్ద.. రైతుల ఉత్పత్తుల ధరలకు చూపరా? అని విజయ్ కేసరి ప్రశ్నించారు. అలాగే.. రైతులకు పెట్టుబడి వ్యయం పెరగలేదా? అని ఆయన అడిగారు. ఇవి వాస్తవాలు. 👉మిర్చి రైతుల విషయంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొనుగోళ్లకు రంగంలో దిగాల్సింది. కానీ, ఆ పని చేయకపోగా.. జగన్ పైనే ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రానికి ఆయన ఒక లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. 👉చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ జగన్ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15న మ్యూజికల్ నైట్ జరుపుకోవడానికి కోడ్ అడ్డం కాలేదా? అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి వెళ్లి.. రైతుల సమస్యలపై వెళ్లినట్లు కలరింగ్ ఇవ్వడమేమిటని చంద్రబాబును జగన్ నిలదీశారు. 👉ధాన్యం కొనుగోళ్లకు తమ హయాంలో 65వేల కోట్లు వ్యయం చేశామని, ఇతర పంటలకు స్థిరీకరణ నిధి ద్వారా సుమారు రూ.7,800 కోట్ల వ్యయం చేశామని కూడా జగన్ చెప్పారు. మిర్చియార్డులో ఓట్ల ప్రస్తావన తేకపోయినా, మైక్ వాడకపోయినా,అసలు ఎన్నికలలో తమ పార్టీ పోటీచేయకపోయినా కేసులు పెట్టారని, దీనికి భయపడేది లేదని.. రైతుల తరపున పనిచేస్తామని జగన్ స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడూ ఇలా రైతుల సమస్యలపై పనిచేసిన రాజకీయ పార్టీల నేతలపై కేసులు పెట్టిన సందర్భాలు లేవు. ఏదో ఒక వంకతో మాజీ సీఎంకు భద్రత కల్పించకపోవడం.. పైగా తప్పుడు కేసులు పెట్టడం అంతా రెడ్ బుక్ పిచ్చి కుక్క ప్రభావంగానే వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఒక్కటి మాత్రం వాస్తవం. ఉమ్మడి ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి చూపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే.. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రైతుల రుణాలు మాఫీ అవ్వడానికి రాజశేఖరరెడ్డి కృషి చేస్తే.. తాకట్టులో ఉన్న బంగారంతో సహా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి చేతులెత్తేసిన నేతగా చంద్రబాబు చరిత్రకెక్కారు. అలాగే.. రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న నేత జగన్. అదే.. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇరవైవేల రూపాయల సాయం చేస్తామని చెప్పి.. ఏడాది గడిచినా ఆ హామీని గాలికొదిలేసిన నేతగా చంద్రబాబు మిగిలిపోయారు. అయినా ఎల్లో మీడియా ద్వారా రైతన్నపై ఫోకస్ పెట్టారంటూ, మిర్చి రైతుకు ఊరట వచ్చేసిందంటూ బిల్డప్ ఇచ్చుకుని చంద్రబాబు అండ్ కో సంతోషపడవచ్చు. కాని దానివల్ల రైతులకు ఒరిగేది ఏమి ఉంటుంది?..:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..: కమిన్స్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో జయభేరి మోగించిన రోహిత్ సేన.. సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో భాగంగా ఆఖరిగా నామమాత్రపు మ్యాచ్‌లో న్యూజిలాండ్(India vs New Zealand)ను ఢీకొట్టనుంది. ఇక కివీస్ కూడా ఇప్పటికే సెమీస్ చేరుకోగా.. ఇరుజట్లకు నాకౌట్ స్టేజ్ కోసం ఇదొక సన్నాహక మ్యాచ్‌గా ఉండబోతోంది.ఇదిలా ఉంటే.. ఈ మెగా వన్డే టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఆమోదంతో తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లన్నీ ఆడుతోంది.భారత్ పటిష్ట జట్టు.. ఆ అడ్వాంటేజ్ కూడా ఉండటం వల్ల..ఈ నేపథ్యంలో ఒకే వేదికపై ఆడటం భారత జట్టుకు అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ‘‘టోర్నీ సజావుగా సాగిపోతోంది. అయితే, ఒకే మైదానంలో ఆడటం వల్ల టీమిండియాకు కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది.అయినా ఆ జట్టు ఎంతో పటిష్టంగా ఉంది. అద్భుతంగా ఆడుతున్నారు. ఒకే వేదికపై ఆడటం మాత్రం అదనంగా ఎంతో కొంత లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు’’ అని యాహూ స్పోర్ట్‌తో కమిన్స్ పేర్కొన్నాడు. కాగా చీలమండ నొప్పి కారణంగా ప్యాట్ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆసీస్ ఈ వన్డే టోర్నీ బరిలో దిగింది. గ్రూప్-బిలో భాగంగా తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడ్డ కంగారూ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయంతో టోర్నీని ఆరంభించిన స్మిత్ బృందం.. తదుపరి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గి సెమీస్ చేరాలనే పట్టుదలతో ఉంది.ఐపీఎల్‌తో రీఎంట్రీఇదిలా ఉంటే.. కమిన్స్ ఐపీఎల్-2025 ద్వారా పునరాగమనం చేయనున్నాడు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ... ‘‘చీలమండ గాయానికి చికిత్స తీసుకుంటున్నాను. ఏదేమైనా ఇంట్లో ఉండటం, కుటుంబ సభ్యులతో సమయం గడపటం సంతోషంగా ఉంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెడతాను.వచ్చే నెల నుంచి ఐపీఎల్ ఆరంభం కాబోతోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన.. ఇలా రానున్న ఆరు నెలలు బిజీబిజీగా గడువబోతోంది’’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా కమిన్స్ ఇటీవలే రెండోసారి తండ్రయ్యాడు. కుమార్తె ఈదికి అతడి భార్య జన్మనిచ్చింది. కాగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆస్ట్రేలియా జట్టుస్టీవ్ స్మిత్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, అలెక్స్ కారీ, గ్లెన్ మాక్స్వెల్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్, సీన్ అబాట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్ మెగర్క్, తన్వీర్ సంఘా.చదవండి: Virat Kohli: ఇదేం తీరు కోహ్లి? ఇలాంటివి అవసరమా?.. మండిపడ్డ గావస్కర్

ప్రధాని మోదీకి మఖానా దండతో స్వాగతం..! 300 రోజులు ఆ సూపర్ ఫుడ్‌తో..
ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్‌లోని భాగల్పూర్లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో సత్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్ ఫుడ్ ప్రీతికరమైన ఆహారమని హైలెట్ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.భారతదేశంలో మఖాన్ ఉత్పత్తిలో బిహార్ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్‌ఫుడ్ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది. దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిహార్‌లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్‌కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.మఖానా అంటే..?మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ. సూపర్ ఫుడ్‌గా ఎందుకు పరిగణిస్తారంటే..ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం. దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాబరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఐటెంశాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయిశరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ ఇదిజీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుందిఅలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.(చదవండి: ఖోబార్ కళ: సీతమ్మ కాలం నాటిది..! కానీ ఇప్పుడు..)

వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు.సౌత్ కొరియా(South Korea) నగరం చెయోనాన్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 10గం. ప్రాంతలో క్రేన్ సాయంతో బ్రిడ్జికి సపోర్ట్‌గా ఉండే ఇనుప నిర్మాణాలను కార్మికులు తరలిస్తున్నారు. ఆ టైంలో అప్పటికే అమర్చిన ఐదు ఇనుప నిర్మాణాలు ఒక్కసారిగా ఒరిగిపోవడంతో.. బ్రిడ్జి కుప్పకూలిపోయింది(Bridge Accident).BIG BREAKING NEWSAt least 3 construction workers killed, 5 injured after portion of highway overpass collapsed near Anseong, South Korea🇰🇷🇰🇷‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️ pic.twitter.com/qk6LSajfLe— WW3 Monitor (@WW3_Monitor) February 25, 2025తొలుత ముగ్గురు మరణించార స్థానిక మీడియా కథనాలు ఇచ్చాయి. అయితే ఇద్దరే ఘటనా స్థలంలో మరణించారని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఘటనపై ఆరా తీసిన తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సంగ్ మోక్(Choi Sang Mok).. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. దక్షిణ కొరియా కార్మిక శాఖ గణాంకాల ప్రకారం.. పని ప్రాంతంలో మరణాలు ఆ దేశంలో గణనీయంగా నమోదు అవుతున్నాయి. 2020-23 మధ్యకాలంలో ఏకంగా 8 వేల మంది కార్మికులు మరణించారక్కడ.

'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.
మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు
రూ.26 లక్షల కోట్ల నిల్వలపై మౌనం వీడిన వారెన్ బఫెట్
సుమనోహర గాథలు
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి!
తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
నాన్నగారిలాగే తెలుగులో సినిమా చేయడం హ్యాపీగా ఉంది: మిమో చక్రవర్తి
ఇండియా బి టీమ్‌పై కూడా పాక్ గెలవలేదు: సునీల్ గవాస్కర్
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
మానసిక రుగ్మతలతో ఇంతమందా..? వెలుగులోకి 'మతి'పోయే విషయాలు
రూ.26 లక్షల కోట్ల నిల్వలపై మౌనం వీడిన వారెన్ బఫెట్
సుమనోహర గాథలు
Ind vs NZ: కివీస్‌తో మ్యాచ్‌లో అతడికి విశ్రాంతి!
తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..
ఓటీటీలోకి 'తండేల్'.. ప్లాన్ మారిందా?
ప్రియుడితో కలిసి పెళ్లికి హాజరైన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
నాన్నగారిలాగే తెలుగులో సినిమా చేయడం హ్యాపీగా ఉంది: మిమో చక్రవర్తి
ఇండియా బి టీమ్‌పై కూడా పాక్ గెలవలేదు: సునీల్ గవాస్కర్
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీనే: సుబ్రహ్మణ్య స్వామి
భారత్‌ను ఓడించకపోతే నా పేరు షెహబాజ్ షరీఫే కాదు
మీకు 21 సీట్లు ఇచ్చినా హిమాలయాలకు వెళ్లిపోతారని సాక్షాత్తూ మోదీ గారే అంటున్నారు.. హోదా వాళ్లకిచ్చినా ప్రజల తరఫున మాట్లాడుతారు
అయితే అన్నీ ఒక్కటేనన్నమాట!
ఈ రాశి వారికి ఆస్తి వివాదాల పరిష్కారం.. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి
క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
అతి చేయొద్దు.. ఇలాంటి ప్రవర్తన సరికాదు: పాక్ దిగ్గజం ఆగ్రహం
NZ Vs BAN: చర్రిత సృష్టించిన రచిన్ రవీంద్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
శాసనమండలిలో వైఎస్సార్సీపీ వర్సెస్ టీడీపీ
శ్రీరెడ్డికి హైకోర్టులో ఊరట
‘అమ్మా.. డ్యాన్స్ ప్రాక్టీస్‌కు వెళ్తున్నా’
సినిమా

'అలాంటి వ్యక్తి దొరకాలి.. కచ్చితంగా పెళ్లి చేసుకుంటా': సుస్మితా సేన్
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.

క్రికెట్ స్టేడియంలో ఊర్వశి ‘దబిడిదిబిడి’.. ‘ఓరీ’ఎంత పనిచేశావ్!
భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆట కాదు..భావోద్వేగాల యుద్దం. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా.. ఇండియా, పాకిస్తానే కాదు ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం(ఫిబ్రవరి23 ) పాకిస్తాన్‌తో భారత్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా తిలకించేందుకు సామాన్య క్రికెట్ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు చాలా మంది దుబాయ్ వెళ్లారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, సుకుమార్, ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)తో పాటు మరికొంతమంది తారలు హాజరయ్యారు. అయితే వీరందరిలో ఊర్వశి రౌతేలా మాత్రమే అందరికి కళ్లను తనవైపుకు తిప్పుకునేలా చేసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్యాన్స్ చేయడంతో పాటు తన బర్త్‌డే వేడుకను కూడా అక్కడే జరుపుకోవడంతో ఈ బాలీవుడ్ భామసెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.మైదానంలో ‘దబిడిదిబిడి’ స్టెప్పులుబాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ చిత్రంలో ఊర్వశి రౌతేలా కీలక పాత్ర పోషించడంతో పాటు ‘దబిడి డిబిడి’ అనే ఐటం సాంగ్‌కి స్టెప్పులేసింది. ఆ స్టెప్పులపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అలాంటి స్టెప్పులేయడంపై నెటిజన్స్ మండిపడ్డారు. అయినా కూడా బాలయ్యతో పాటు చిత్రబృందం ఎవరూ స్పందించలేదు. ఇక తాజాగా ఇదే పాటకు క్రికెట్ స్టేడియంలో మరోసారి స్టెప్పులేసింది ఊర్వశి.ఓరీ..అదేం పనిఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భారత్ ఆడిన చాలా మ్యాచ్ లలో మెరిసింది. ఇక తాజాగా దుబాయ్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో ఓరీ(Orry)తో కలిసి డబిడి డిబిడి పాటకు స్టెప్పులేసింది. కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ చేస్తుండగా.. ఓరీ సడెన్‌గా ఆమెకు ముద్దు పెట్టాడు. దీంతో ఊర్వశి షాక్ అయింది. కొద్ది క్షణాలు అలానే ఆశ్చర్యంగా చూసింది. అనంతరం మళ్లీ సరదగా చిందులేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Orhan Awatramani (@orry)ఎవరీ ఓరీ?ఓర్హాన్ అవత్రమని(Orhan Awatramani)... సింపుల్‌గా ఇతడిని ఓరీ అని పిలుస్తుంటారు.న్యూయార్క్ పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడట. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ఓ ఆఫీసులో స్పెషల్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా, గ్రాఫిక్ డిజైనర్‌గా రకరకాలుగా పని చేసిన ఇతడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ తారల పార్టీల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. బాలీవుడ్ తారల ప్రతి పార్టీలోనూ ఓరీ కనిపిస్తాడు. చిత్ర విచిత్ర పోజులు ఇస్తూ వారిని నవ్విస్తాడు.

'మీ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాను'.. అమిర్ ఖాన్‌తో డ్రాగన్ హీరో
జీవితం ఊహించలేనిది.. ఇలా అన్నది ఎవరో తెలుసా? అది తెలుసుకోవాలంటే ముందుగా యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గురించి చెప్పాలి. ఈయన కోమాలి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టారు. ఆ తరువాత మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తారని అందురూ ఎదురు చూశారు. అలాంటిది హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా ఈయన స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తరువాత ఈయనకు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి.అలా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం డ్రాగన్. ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఓ మై గాడ్ చిత్రం ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ నెల 21వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం వైపు పరుగులు తీస్తోంది.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను కలవడం ఆసక్తిగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు. దీనికి ప్రదీప్ రంగనాథన్ సహ నిర్మాత కావడం గమనార్హం. అందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైత్ ఖాన్, శ్రీదేవి వారసురాలు ఖుషీ కపూర్ జంటగా నటించారు. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదన్నది గమనార్హం.ఇలాంటి పరిస్థితిలో ప్రదీప్ రంగనాథన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను చెన్నైలో కలవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ డ్రాగన్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచనతో ఆయన్ని కలిశారా? లేక మరోదైన విషయం కోసం కలిశారా? అన్న చర్చ జరుగుతోంది. అయితే అమీర్‌ఖాన్ ప్రస్తుతం నటుడు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.అదే విధంగా అనారోగ్యానికి గురైన ఆయన తల్లి చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను పరామర్శించడానికి ప్రదీప్ రంగనాథన్ వెళ్లారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా అమీర్‌ఖాన్‌తో ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసిన ప్రదీప్ రంగనాథన్ అందులో.. జీవితం ఊహించలేనిది అని నేను ఎప్పుడూ చెబుతాను.. మీ అద్భుతమైన మాటలకు ధన్యవాదాలు అమిర్ ఖాన్ సార్.. జీవితాంతం దాన్ని గుర్తుంచుకుంటాను అని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐకే చిత్రంలో నటిస్తున్నారు. Life is unpredictable as i always say :) Thankyou for your wonderful words #aamirkhan sir . Will cherish it for life ❤️ pic.twitter.com/HPjpJLvDN2— Pradeep Ranganathan (@pradeeponelife) February 23, 2025

ప్రభాస్ సినిమా.. సుప్రీకోర్టులో నిర్మాతకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలంటూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. అంతేకాక తదుపరి విచారణ వరకు దిల్ రాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ‘నా మనసు నిన్ను కోరే నవల‘ఆధారంగా ‘మిస్టర్ పర్ఫెక్ట్‘అనే సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్ముడి శ్యామలాదేవి 2017లో దిల్ రాజుపై కేసు పెట్టారు. దీంతో మాదాపూర్ పోలీసులు నిర్మాత దిల్ రాజుపై కాపీ రైట్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు విచారణ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో జరిగింది. విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సిటీ సివిల్ కో ర్టు.. సాక్ష్యాలను పరిశీలించి 2019లో దిల్ రాజుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దిల్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ జె.బి. పార్ధీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. వాద నలు విన్న ధర్మాసనం తదుపరి విచార ణను రెండు వారాలపాటు వాయిదా వేసింది. అప్పటి వరకు సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విషయానికొస్తే.. ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం 2011లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. దశరథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్

ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలి... వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు

చంద్రబాబు మోసాలకు గ్రూపు-2 అభ్యర్థులే ప్రత్యక్ష నిదర్శనం... న్యాయం చేస్తానంటూ నట్టేట ముంచాడు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో భూ దోపిడీకి ఇక రాజముద్ర... అమరావతిలో రైతుల నుంచి లాక్కున్న అసైన్డ్ భూములకు రిటర్నబుల్ ప్లాట్లు.. సీఆర్డీఏకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశం

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం కుట్ర... జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడి భద్రతపై ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం

‘మార్గదర్శి’ మోసాల కేసును మూసివేసే దిశగా అడుగులు... చంద్రబాబు డైరెక్షన్లో ప్లేటు ఫిరాయించిన ఆంధ్రప్రదేశ్ సీఐడీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలనలో రైతు బతికే పరిస్థితి లేదు... ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

తప్పు చేసినోళ్లు ఎక్కడున్నా వదలం. టీడీపీకి కొమ్ముకాసే పోలీసు అధికారులు, ఆ పార్టీ నేతలకు వైఎస్ జగన్ హెచ్చరిక. జైలులో ఉన్న వంశీని పరామర్శించిన వైఎస్ జగన్

తెలంగాణలో వెంటనే కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలి... అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

మేము ఒక తప్పు చేయాలంటే, ఒకటేంటి సార్ మూడు చేద్దామంటున్నారు... అధికారుల వ్యవహార శైలిపై సంతోషంగా లేను... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలకు కప్పం కడితేనే మైనింగ్... రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన గనుల తవ్వకాలు
క్రీడలు

ఛాంపియన్స్ ట్రోఫీలో 'పాక్' చెత్త ప్రదర్శన.. అతడిపై వేటు..!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆతిథ్య పాకిస్తాన్(Pakistan) ప్రయాణం గ్రూపు స్టేజిలోనే ముగిసింది. 29 ఏళ్ల తర్వాత తమ సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన రిజ్వాన్ బృందం.. ఈ టోర్నీ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.హెడ్ కోచ్‌పై వేటు..ఇందులో భాగంగా తమ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్ అకిబ్ జావెద్‌తో పాటు సహాయక సిబ్బందిని తొలిగించాలని పీసీబీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతేడాది ఆఖరిలో గ్యారీ కిర్‌స్టెన్ తప్పుకున్న తర్వాత పాక్ జట్టు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సెలక్షన్ కమిటీలో భాగంగా ఉన్న అకిబ్ జావెద్‌ను పీసీబీ నియమించింది.ఆ తర్వాత జాసన్ గిల్లెస్పీ తప్పుకోవడంతో టెస్టు జట్టుకు కూడా అకిబ్నే కోచ్‌గా కొనసాగించారు. అతడి నేృత్వంలోనే పాక్ జట్టు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లను సొంతం చేసుకుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చే సారికి పాక్ జట్టు పూర్తిగా తేలిపోయింది."ఛాంపియన్స్ ట్రోఫీలో మా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. పాక్ జట్టుకు వేర్వేరు ప్రధాన కోచ్‌లు(వైట్‌బాల్, రెడ్ బాల్ క్రికెట్) ఉంటారా అనే దానిపై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మెగా టోర్నీలో పాక్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో ప్రస్తుత కోచింగ్ స్టాప్ మొత్తాన్ని మార్చడం ఖాయమని" ఓ పీసీబీ సీనియర్ అధికారి పీటీఐతో పేర్కొన్నారు. అయితే పీసీబీ విదేశీ కోచ్‌ల కోసం కాకుండా, తమ దేశ మాజీ ఆటగాళ్లను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. ఇక పాక్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఫిబ్రవరి 27 రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.చదవండి: దేశవాళీలో ఆడితే మంచిదే కానీ...

ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. టోర్నీ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ ఆల్ రౌండర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్స్ ఎడమ కాలికి గాయమైంది.అయితే గాయం కాస్త తీవ్రమైనది కావడంతో ఈసీబీ వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించినట్ల తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్ధానాన్ని లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌తో ఇంగ్లండ్ క్రికెట్ భర్తీ చేసింది. "బ్రైడన్ కార్స్ మెకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.అతడి స్ధానంలో లీసెస్టర్‌షైర్, ఇంగ్లండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నామని" ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రెహాన్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో పాటే ఉన్నాడు. అతడిని ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్‌బైగా ఇంగ్లండ్ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇప్పుడు కార్స్ దూరం కావడంతో ప్రధాన జట్టులో అహ్మద్‌కు చోటు దక్కింది. కాగా అహ్మద్‌కు అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాడు. అతడిని జట్టులోకి తీసుకోవడం ఇంగ్లీష్ జట్టు స్పిన్ బలాన్ని పెంచుతుంది. ఇప్పటివరకు తీలయన్స్ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆదిల్ రషీద్ మాత్రమే ఉన్నాడు. అహ్మద్‌కు బ్యాట్‌తో రాణించే సత్తాకూడా ఉంది. రెహాన్ తన కెరీర్లో ఇప్పటివరకు 6 వన్డేలు ఆడి పది వికెట్లు పడగొట్టాడు.కాగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. బట్లర్ సేన తమ తదుపరి మ్యాచ్‌లో ఫిబ్రవరి 26న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే అఫ్గాన్‌పై తప్పక గెలవాల్సిందే.ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు..జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్

రంజీ ట్రోఫీ ఫైనల్.. జట్టును ప్రకటించిన విదర్భ
మూడోసారి రంజీ ట్రోఫీ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రెండుసార్లు చాంపియన్ విదర్భ జట్టు ఈనెల 26 నుంచి కేరళ జట్టుతో జరిగే ఫైనల్ కోసం జట్టును ప్రకటించింది. గుజరాత్ జట్టుతో జరిగిన సెమీఫైనల్లో పోటీపడ్డ 17 మంది సభ్యులనే ఫైనల్ మ్యాచ్‌కూ కొనసాగించాలని విదర్భ క్రికెట్ సంఘం (వీసీఏ) సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది.అక్షయ్ వాడ్కర్ జట్టుకు సారథ్యంలోనే విదర్భ ఫైనల్లో బరిలోకి దిగుతుందని వీసీఏ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ సీజన్లో విదర్భ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ఫైనల్‌కు అర్హత సాధించింది. గత ఏడాది 42 సార్లు రంజీ చాంపియన్ ముంబై జట్టు చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచిన విదర్భ ఈసారి మాత్రం ట్రోఫీని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది.ఈ సీజన్లో యశ్ రాథోడ్ (933 పరుగులు), హర్‡్ష దూబే (66 వికెట్లు) నిలకడగా రాణించి విదర్భ జట్టు ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించారు. విదర్భ జట్టు 2017–18, 2018–19 వరుస సీజన్లలో రంజీ చాంపియన్‌గా నిలిచింది. విదర్భ రంజీ జట్టు: అక్షయ్ వాడ్కర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అథర్వ తైడె, కరుణ్ నాయర్, ధ్రువ్ షోరే, యశ్ రాథోడ్, యశ్ కదమ్, యశ్ ఠాకూర్, హర్ష్ దూబే, అమన్ మొఖాడె, అక్షయ్ కర్నెవార్, అక్షయ్ వఖారె, ఆదిత్య థాకరే, దర్శన్ నల్కండే, నచికేత్ భుటె, సిద్ధేశ్ వథ్, దానిశ్ మలెవార్, పార్థ్ రఖాడె.చదవండి: Champions Trophy 2025: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టోర్నీ నుంచి ఔట్

'అతడు కోహినూరు వజ్రం లాంటి వాడు.. తరానికి ఒక్కడే ఉంటాడు'
విరాట్ కోహ్లి.. ప్రపంచ క్రికెట్లో తనను మించిన ఛేజ్ మాస్టర్ లేడని మరోసారి నిరూపించుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy 2025)లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే కింగ్ కోహ్లి(Virat Kohli) సమాధనమిచ్చాడు.దాయాదిపై విరాట్ ఆజేయ శతకం సాధించాడు. ఈ ఢిల్లీ క్రికెటర్ లక్ష్య చేధనలో ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించాడు. అతడి ఇన్నింగ్స్‌కు, పట్టుదలకు ప్రత్యర్ధి జట్టు కెప్టెన్ సైతం ఫిదా పోయాడు. ఈ మ్యాచ్‌లో 111 బంతులు ఎదుర్కొన్న కోహ్లి సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లికి ఇది 51వ సెంచరీ కాగా.. అంతర్జాతీయ కెరీర్లో 82వది కావడం. సచిన్ 100 సెంచరీలకు కోహ్లి 18 శతకాల దూరంలో ఉన్నాడు.కోహ్లి ప్రదర్శనపై అన్ని వైపులనుంచి ప్రశంసలు వస్తున్నాయి. "అతని ఆటను చూస్తే కనీసం మరో 2–3 ఏళ్లు ఆడి మరిన్ని శతకాలు సాధించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లిలాంటి ఆటగాడు తరానికొక్కడు మాత్రమే ఉంటాడు. అతని పట్టుదల, పోరాటతత్వం ఈ మ్యాచ్‌లో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో బాగా ఆడినప్పుడు ఒకరి సత్తా ఏమిటో తెలుస్తుంది. కోహ్లి కనీసం మరో 2–3 ఏళ్లు ఆడటం మాత్రమే కాదు, మరో 10–15 సెంచరీలు సాధిస్తాడని బల్లగుద్ది చెప్పగలను. గత ఆరు నెలల్లో అతనిపై విమర్శలు వచ్చాయి. కానీ పాకిస్తాన్‌పై పరుగులు సాధించడం మరో పదేళ్ల పాటు దీనిని ఎవరూ మరచిపోలేరు’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. కుర్రాళ్లు కోహ్లి లాంటి ఆటగాళ్ల నుంచే స్ఫూర్తి పొందుతారని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళతారని సిద్ధూ అభిప్రాయ పడ్డాడు. ‘కోహ్లి సామర్థ్యం ఏమిటో ఈ మ్యాచ్‌లో కనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో అతని ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు చూస్తే పాత విరాట్ గుర్తుకొచ్చాడు. ఇన్నింగ్స్ సాగిన కొద్దీ అతనిలోని పోరాట తత్వానిŠన్ నేను చూశాను. ఒక ఆట ఎదగాలంటే ఇలాంటివారే స్ఫూర్తిగా నిలుస్తారు.అతను కోహినూర్‌లాంటి వాడు. ఛేదనలో కోహ్లి రికార్డు చూస్తే ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనీయకుండా ఆడతాడని అర్థమవుతుంది. కోహ్లి సెంచరీ చేసినప్పుడు రోహిత్ శర్మ కూడా ఎంతో ఆనందంగా కనిపించాడు. సహచరుడి పట్ల గర్వంగా ఉండటం టీమ్ గేమ్‌లో ఉండే గొప్పతనం ఏమిటో చూపించింది’ అని సిద్ధూ పేర్కొన్నాడు.
బిజినెస్

ఐటీలో వేతన పెంపు ఎంతంటే..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగంలో ఈ ఏడాది (2024–25) వేతన పెంపు మోస్తరుగానే ఉండొచ్చని పరిశ్రమకు చెందిన నిపుణులు అంచనా వేస్తున్నారు. సగటున 4–8.5 శాతం మధ్య పెంపు ఉండొచ్చని భావిస్తున్నారు. అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే ఇది తక్కువ కావడం గమనార్హం. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యం, కృత్రిమ మేథ (ఏఐ) వినియోగం పెరుగుతుండడం, నైపుణ్యాలకు డిమాండ్ తదితర పరిస్థితులను ఇందుకు నిదర్శంగా ప్రస్తావిస్తున్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇంజనీరింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ తదితర కీలక నైపుణ్యాలున్న వారికి మరింత అధికంగా వేతన పెంపులు లభించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వేతన పెంపు విషయంలో ఐటీ కంపెనీలు అప్రమత్త ధోరణి అనుసరించొచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణవిజ్ అభిప్రాయపడ్డారు.‘ఐటీ కంపెనీల్లో వేతన పెంపు 4–8.5 శాతం మధ్య ఉండొచ్చు. క్రితం సంవత్సరాల కంటే తక్కువ. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు, విచక్షణారహిత వ్యయాల తగ్గింపు, వ్యాపార ప్రాధాన్యతల్లో మార్పుతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఏప్రిల్–జూన్ మధ్య సాధారణంగా చేపట్టే వేతన పెంపును మరింత జాప్యం చేయొచ్చు’ అని వివరించారు. సంస్థలు వేతన పెంపునకు బదులు రిటెన్షన్ బోనస్ (కంపెనీతోనే కొనసాగితే), ఇ–సాప్లు, ప్రాజెక్ట్ ఆధారిత ఇన్సెంటివ్‌లు ఇవ్వొచ్చన్నారు. 5–8.5 శాతం..ఈ ఏడాది ఐటీలో వేతనాల పెంపు 5–8.5 శాతం మధ్య ఉండొచ్చని రీడ్ అండ్ విల్లో సీఈవో జానూ మోతియాని అంచనా వేశారు. ‘రెండంకెల వేతన పెంపులు ఇప్పటికైతే గతమే. పరిశ్రమ వ్యాప్తంగా అప్రమత్త ధోరణి నెలకొంది. టీసీఎస్ 4–8 శాతం మధ్య వేతన పెంపును (ఏప్రిల్ నుంచి) ప్రకటించడం ద్వారా మిగిలిన పరిశ్రమ వ్యాప్తంగా ఇదే తరహా పెంపునకు బాటలు వేసింది’ అని వివరించారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఇంకా తుది ప్రకటనలు చేయలేదని, అవి రక్షణాత్మక ధోరణితో అడుగులు వేస్తున్నట్టుందన్నారు. ఏఐ ఆధారిత సామర్థ్యాలకు డిమాండ్ పెరుగుతుండడం, క్లయింట్ డిమాండ్లలో మార్పులు ఐటీ కంపెనీల వేతన బడ్జెట్ కేటాయింపులను ప్రభావితం చేస్తున్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టివలసలూ తగ్గాయ్..ఐటీ రంగంలో వలసల రేటు (ఉద్యోగులు కంపెనీలను వీడడం) 2023లో 18.3 శాతం ఉంటే, 2024 చివరికి 17.7 శాతానికి తగ్గడం గమనించొచ్చు. వలసల రేటు నిదానించడంతో వారిని కాపాడుకునేందుకు రిటెన్షన్ బోనస్, దూకుడుగా పారితోషికాలు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి లేకపోవడాన్ని మోతియాని ప్రస్తావించారు. సగటు వేతన పెంపులు 6–10 శాతం మధ్య ఉండొచ్చని, ఏఐ తదితర డిమాండ్ నైపుణ్యాలు కలిగిన మధ్యస్థాయి నుంచి సీనియర్ ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించొచ్చని అడెకో ఇండియా అంచనా వేసింది. ‘ఫ్రెషర్లకు వేతన పెంపులు 2–4 శాతం మధ్య ఉండొచ్చు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ తదితర ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి 10–12 శాతం వరకు కూడా వేతనాలు పెరగొచ్చు. సీనియర్ లెవల్ నిపుణులు, ముఖ్యంగా కీలకమైన టెక్నికల్ విధులు, నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారికి 12–15 శాతం మధ్య వేతన పెంపు ఉండొచ్చు’ అని అడెకో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చెమ్మన్‌కోటిల్ తెలిపారు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) ప్రకారం దేశ జీడీపీలో ఐటీ రంగం వాటా 7 శాతంగా ఉంది.

భారత్‌లో ఎల్జీ ఛైర్మన్ పర్యటన
న్యూఢిల్లీ: భారత్‌లో లిస్టింగ్‌పై ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కంపెనీ మాతృ సంస్థ ఎల్జీ కార్పొరేషన్ చైర్మన్ ‘క్వాంగ్ మో కూ’ భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఎండీతో పాటు పలు సీనియర్ అధికారులతో ఆయన భేటీ అవుతారని, ఐపీవో సన్నాహాల గురించి తెలుసుకుంటారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అలాగే పెట్టుబడుల ప్రణాళికలను చర్చించవచ్చని వివరించాయి.గ్రేటర్ నోయిడాలోని కంపెనీ ప్లాంటును ఆయన సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ వర్గాలతో కూడా భేటీ అవుతారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐపీవో ద్వారా ఎల్జీ ఎల్రక్టానిక్స్ 1.5 బిలియన్ డాలర్ల వరకు సమీకరించనున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూకి సంబంధించి కంపెనీ రోడ్‌షోలు కూడా నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా ఆదాయం రూ. 64,088 కోట్లుగా నమోదైంది.

పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా విక్రయంపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు, లిస్టెడ్ ఫైనాన్షియల్ సంస్థలలో వాటా విక్రయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులు, పబ్లిక్ ఆస్తుల నిర్వహణ సంస్థ(దీపమ్) మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలకు ఆహ్వానం పలికింది. రెండు రకాల ప్రతిపాదనల(రిక్వస్ట్ ఫర్ ప్రపోజల్–ఆర్ఎఫ్పీ)కు తెరతీసింది. దీనిలో భాగంగా మర్చంట్ బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను మూడేళ్ల కాలానికి దీపమ్ ఎంపిక చేయనుంది. గడువును మరో ఏడాది పొడిగించేందుకు వీలుంటుంది. ఎంపికైన సంస్థలు వాటాల విక్రయం విషయంలో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించవలసి ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలలో వాటాల విక్రయంలో ప్రభుత్వానికి తగిన విధంగా సహకారం అందించవలసి ఉంటుంది. ఇందుకుగాను మర్చంట్ బ్యాంకర్లు బిడ్స్ దాఖలు చేసేందుకు మార్చి 27వరకూ దీపమ్ గడువు ప్రకటించింది. అయితే రెండు కేటగిరీలలో మర్చంట్ బ్యాంకర్లు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. ఏప్లస్ విభాగంకింద రూ. 2,500 కోట్లు లేదా అంతకుమించిన పరిమాణంగల లావాదేవీల నిర్వహణ ఉంటుంది. ఏ కేటగిరీలో రూ. 2,500 కోట్ల విలువలోపు వాటాల విక్రయంలో ప్రభుత్వానికి మద్దతివ్వవలసి ఉంటుందని దీపమ్ తెలియజేసింది. ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ ప్రభుత్వ రంగ సంస్థలలో వాటా విక్రయ వ్యవహారాలను పర్యవేక్షించే సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా నిబంధనను పలు ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అమలు చేయవలసి ఉంది. ఇందుకు ప్రభుత్వం 2026 ఆగస్ట్ 1వరకూ గడువునిచ్చింది. తద్వారా ప్రభుత్వ వాటాను తగ్గించడంతోపాటు.. పబ్లిక్ వాటా పెంచవలసి ఉంది. ఐదు బ్యాంకులు ప్రధానంగా ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకులు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటా 98.3 శాతంకాగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 96.4 శాతం, యుకో బ్యాంక్‌లో 95.4 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.1 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.5 శాతం చొప్పున వాటా కలిగి ఉంది. ఇదే విధంగా ఐఆర్ఎఫ్సీలో 86.36 శాతం, న్యూ ఇండియా ఎస్యూరెన్స్‌లో 85.44 శాతం, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో 82.4 శాతం చొప్పున ప్రభుత్వానికి వాటా ఉంది. వెరసి ఈ సంస్థలలో పబ్లిక్కు కనీస వాటా నిబంధనను అమలు చేయవలసి ఉంది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం విదితమే.

ఆసియాపసిఫిక్ దేశాలకు టారిఫ్ ముప్పు
న్యూఢిల్లీ: ట్రంప్ హయాంలో పలు ఆసియా పసిఫిక్ దేశాలకు అధిక టారిఫ్‌ల రిస్క్ లు నెలకొన్నాయని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ వెల్లడించింది. భారత్, దక్షిణ కొరియా, థాయ్‌ల్యాండ్ తదితర దేశాలకు ముప్పు ఉందని ఒక నివేదికలో పేర్కొంది. మిగతా దేశాలతో పోలిస్తే తైవాన్, వియత్నాం, థాయ్‌ల్యాండ్, దక్షిణ కొరియాలాంటివి అమెరికాపై ఎక్కువగా ఆధారపడినందువల్ల టారిఫ్‌లు విధిస్తే ఆర్థికంగా వాటిపై ప్రభావం పడుతుందని వివరించింది. భారత్, జపాన్‌లో దేశీ మార్కెట్ కాస్త భారీగా ఉండటం వల్ల టారిఫ్‌ల ప్రభావం నుంచి కొంత ఉపశమనం ఉండొచ్చని వివరించింది. భారత్ సహా వాణిజ్య భాగస్వాములపై ప్రతీకార టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేసిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఆసియా పసిఫిక్‌లోని కొన్ని దేశాలు తమ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలకన్నా అత్యధికంగా అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్నాయని నివేదిక వివరించింది. ప్రతీకార టారిఫ్ చర్యల కోసం సదరు దేశాలను పరిశీలించే అవకాశం ఉందని పేర్కొంది.
ఫ్యామిలీ

మెడిటేషన్‌కి అనుగుణంగా ఇంటిని మార్చేద్దాం ఇలా..!
ఎన్నో కారణాల వల్ల ఇంటా బయటా ఒత్తిడితో జీవనం సాగించే రోజులివి. ఒత్తిడి నుంచి ఉపశమనానికి ఎవరికి తోచిన సలహాలు వాళ్లు చెబుతుంటారు. కాని, ఇంట్లోనే సానుకూల వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ప్రశాంతతతో పాటు ధ్యాన సాధనకూ అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న మార్పులతో ధ్యానానికి అనువుగా ఇంట్లోనే ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటి గదుల్లో ఏదైనా ఒక మూలన బుద్ధ ప్రతిమ లేదా క్యాండిల్స్, ఆర్టిఫియల్ ట్రీ లేలా ఇండోర్ ప్లాంట్ తీగలనూ డిజైన్ చేసుకోవచ్చు. ప్రశాంతతను కలిగించే సంగీతం వింటూ రోజూ ఈ ప్లేస్‌లో కాసేపు సేద దీరితే మనసు, శరీరం విశ్రాంతి పొందుతాయి.మట్టి కుండలు లేదా రాళ్లతో డిజైన్ చేసిన ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ లభిస్తాయి. వాటి అలంకరణతో జలపాతపు ఆహ్లాదాన్ని పొందవచ్చు. ధ్యానం చేయడానికి అనువైన ప్లేస్ అలంకరణకు బేబీ మాంక్స్ బొమ్మలు, బోన్సాయ్ మొక్కలు, స్టోన్ వర్క్‌తో డిజైన్ చేసిన వస్తువులను ఎంచుకోవచ్చు. వీటిని చూసినప్పుడు చికాకుగా ఉన్న మనసు కొంత కుదుటపడుతుంది. మనలోని ఏడు చక్రాలకు గుర్తుగా ఏడు రంగులు సూచికగా ఉంటాయి. వాటిని తలపించేలా కలర్ కాన్సెప్ట్‌తో చక్రా షెల్ఫ్ డిజైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్‌గా లభించే వాటినీ అమర్చుకోవచ్చు. ఈ కలర్ చక్రా షెల్ఫ్‌ల రంగులను బట్టి ధ్యానాన్ని ఏకాగ్రతతో సాధన చేయవచ్చు. అలంకరణలో చక్రా షెల్ఫ్, వాల్ హ్యాంగింగ్, ఫొటో ఫ్రేమ్స్‌తో లివింగ్ రూమ్నీ అందంగా అలంకరించవచ్చు. (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)

అతడి వెయిట్‌లాస్ జర్నీకి నటుడు హృతిక్ రోషన్ ఫిదా..!
ఎందరో తమ వెయిట్ లాస్ జర్నీతో స్ఫూర్తిని రగులుస్తున్నారు. బరువు తగ్గడం ఏమి భారం కాదని చేతలతో నిరూపిసతున్నారు. అంతేగాదు కొందరూ అచంచలమైన దీక్షతో బరువు తగ్గి ఊహించని రీతీలో స్మార్ట్‌గా మారి సెలబ్రిటీల చేత గ్రేట్ చేత ప్రశంసలందుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినవాడే ఫిట్నెస్ ఇన్‌ప్లుయెన్సర్ ఫుర్కాన్ ఖాన్. అతడు అంతలా ఓపికతో వ్యహరించి మరీ బరువు తగ్గిన తీరు నెటిజన్లందరినే గాక బాలీవుడ్ ప్రసిద్ధ నటుడుని సైతం ఇంప్రెస్ చేసింది. 23 ఏళ్ల ఫుర్కాన్ ఖాన్ తన ఫిట్నెస్ జర్నీని డాక్యుమెంట్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియోకి 'ఓపికతో కసరత్తులు చేస్తూనే ఉండండి' అనే క్యాప్షన్‌తో తన వెయిట్ లాస్ జర్నీ వీడియోలు షేర్ చేసేవాడు. ఆ వీడియోలో పుర్కాన్ జనవరి 19 2024 జిమ్‌లో చేరిన 9 రోజుల తర్వాత అనే క్లిప్‌తో ప్రారంభమవుతుంది. ఒక ఏడాది క్రితం తాను ఎలా ఉన్నాడో చూపిస్తూ తన ఫిట్నెస్ జర్నీని గురించి వివరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే అంతలా జిమ్‌లో వర్కౌట్లు చేసినా ఫలితం మాత్రం త్వరగా రాదు. అయినా స్కిప్ చేయకుండా కష్టపడుతున్న తీరు వీడియోలో కనిపిస్తుంటుంది. మొదటి మూడు నుంచి నాలుగు నెలల్లో పెద్ద మార్పు కనిపించదు. శరీరాన్ని ఫిట్‌గా నిర్మించుకోవడానికి సంవత్సరాలు పట్టినా సరే.. మనం మాత్రం మన వర్కౌట్లు స్కిప్ చేయకూడదని చెబుతుంటాడు. ఓపిక అనేది అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతుంటాడు. అయితే అలా చేయగా చేయగా.. ఫుర్కాన్ శరీరంలో చక్కటి మార్పు కనిపిస్తూ ఉంటుంది. చివరగా ఏది ఒక్క రోజులో జరగదనేది బాగా గుర్తించుకోండి అంటూ ముగిస్తాడు వీడియోలో. అతడి విజయవంతమైన వెయిట్ లాస్ జర్నీకి నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున సానుకూల స్పందన రావడమే గాక స్వయంగా హృతిక్ రోషన్ నుంచే మన్ననలను అందుకోవడం విశేషం. హృతిక్ సదరు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫుర్కాన్ని "మీరు బాగా చేశారు" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసించారు. దీంతో నెటిజన్లు బ్రో గ్రీకు దేవుడు హృతిక్ నుంచే ప్రశంసలు అందుకున్నావు కదా..! నువ్వు గ్రేట్ అంటూ మెచ్చుకోగా, మరొకరు స్థిరత్వం, క్రమశిక్షణ ఎంత గొప్పవనేది తెల్తుస్తుందంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Furkan Khan (@flexwithfurru) (చదవండి: ఝుమైర్ నృత్యం అంటే..? ఈ వేడుకకు ప్రధాని మోదీ, జైశంకర్‌లు..)

అవే కొంపముంచాయా? కోలకత్తా సెన్సేషనల్ కేసులో బిగ్ ట్విస్ట్!
కోలకతాలోని టాంగ్రాలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒకే కుటుంబంలో ఒక మైనర్ బాలికతో సహా ముగ్గురు మహిళల హత్య కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా పోలీసులు ఆ కుటుంబం భారీ అప్పులు చేసిందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీవిలాసవంతమైన జీవనశైలిని వీడలేదు.ఈ కారణంగానే భార్యల్ని హత్యచేసి, ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు హత్యలు జరిగిన రోజు ఇంట్లోని సీసీటీవీలను కూడా ఆఫ్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు.ప్రణయ్ డే , ప్రసున్ డే కుటుంబాలు విలాసవంతమైన జీవితానికి అలువాటుపడి అప్పుల పాలైపోయారు. అయినా ఇద్దరు సోదరులు తమ విలాసవంతమైన జీవనశైలిని వీడలేదు. దీనివల్ల అప్పులు మరింత పెరిగాయి. తోలు వస్తువుల వ్యాపారం చేసే వీరికి భారీ అప్పులు చేసిందని, అందుకే ఇద్దరు సోదరులు ఈ చర్యకు పాల్పడి ఉండవవచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని నగర పోలీసు వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబానికి చెందిన కొంతమంది సన్నిహితుల విచారణలో ఈ విషయాలు తేలాయని పోలీసులు తెలిపారు. చదవండి: రెండు గేదెల కోసం పెళ్లికి సిద్ధమైన మహిళ కట్ చేస్తే..! వైరల్ స్టోరీచందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిఫిబ్రవరి 19 ఉదయం కోల్‌కతా తూర్పు శివార్లలోని టాంగ్రాలోని వారి నివాసం నుండి ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలను పోలీసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోదరులు ప్రణయ్, ప్రసున్ డే, వారి భార్యలు సుధేష్ణ, రోమి డేలతో కలిసి టాంగ్రాలోని ఇంట్లో నివసించేవారు. ప్రణయ్ సుధేష్ణల దంపతులకు ప్రతీక్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అన్నదమ్ములిద్దరూ తమ భార్యల్ని, కుమార్తెను (ప్రణయ్ భార్య సుధేష్ణ (39), ప్రసున్ భార్య రోమి (44), ప్రసున్-రోమి కుమార్తె ప్రియాంవద(14)) హత్య చేసిన తరువాత ఆత్మహత్యకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నం విఫలం కావడంతో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. మరోవైపు మృతుల దేహాలపై గాయాలుండటం మరింత అనుమానాలను తావిచ్చింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఇవి హత్యలుగా తేలాయి. దీంతో ప్రణయ్, ప్రసున్లను అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిమూడువేల మంది మహిళలు చీర కట్టి.. పరుగు పెట్టి!అనేక అనుమానాలు, ప్రశ్నలుకోల్కతాలోనిఒక ఇంట్లో మైనర్‌బాలికతో సమా ఇద్దరు మహిళ హత్యలు గ్భ్రాంతికి గురిచేశాయి. అందరమూ కలిసి ఆత్మహత్య చేసుకుందామనుకుని విషంతీసుకున్నామని, ప్రసున్, ప్రణయ్ తెలిపారు.కుటుంబ సభ్యులందరూ డ్రగ్ కలిపిన డెజర్ట్ తిన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని ఒక సీనియర్ అధికారి తెలిపారు.కానీ బాలికలో తప్ప, మిగిలిన ఇద్దరి మహిళల్లో విషయ ప్రయోగం జరిగిన దాఖలు కనిపించలేదని కూడా ఆయన తెలిపారు. పైగా పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు, తీవ్ర రక్త స్రావంగానే మరణాలు సంభవించాయని పోస్ట్ మార్టం నివేదిక తేల్చింది. అలాగే మంగళవారం మధ్యాహ్నం 1 గంట నుండి బుధవారం తెల్లవారుజామున 1 గంట మధ్య హత్యకు గురయ్యారు.బుధవారం తెల్లవారుజామున 12.51 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన తర్వాత (సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం) అలా చేయడానికి వారికి రెండున్నర గంటలు ఎందుకు పట్టింది?ప్రమాదానికి ముందు వారు రెండున్నర గంటలు నగరం చుట్టూ ఎందుకు తిరిగారు?మంగళవారం ఇంటికి వచ్చిన పనిమనిషిని బుధవారం ఉదయం రమ్మని ఎందుకు అడిగారు?ఎయిర్‌బ్యాగ్‌లతో కారును ఢీకొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి? బాలికను హత్య చేసి అబ్బాయిని తమ వెంట ఎందుకు తీసుకెళ్లారు?

Mega Jhumur: ప్రధాని మోదీ గెస్ట్‌గా మెగా ఝుమైర్
ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సోమవారం అస్సాం అతిపెద్ద ఝుమైర్ నృత్య కార్యక్రమం జరగనుంది. ఇందులో ఎనిమిదివేల మందికి పైగా పాల్గొంటారు. అంతేగాదు ఈ నృత్య ప్రదర్శనను విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో సుమారు 60 మందికి పైగా విదేశీ దౌత్యవేత్తలు వీక్షించనున్నారు. అలాగే ప్రజలందరూ వీక్షించేలా దాదాపు 800 టీ ఎస్టేట్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకీ అసలేంటీ నృత్యం..? దాని ప్రాముఖ్యత తదితరాల గురించి తెలుసుకుందాం. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఝుమైర్ ప్రాముఖ్యత గురించి పలుమార్లు పునరుద్ఘాటించారు. ఇది అస్సామీ సంస్కృతిలో అంతర్భాగం, టీ తెగ కమ్యూనిటీ భావాలను ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి బిస్వా ఢిల్లీలో రాబోయే ప్రదర్శనల ప్రణాళికలను ప్రకటిస్తూ..అంతర్జాతీయ వేదికపై కూడా ఈ నృత్యం ప్రదర్శించాలనే తన ఆశయాన్ని వ్యక్తం చేశారు. ఇంతలా అస్సాం గిరిజనులతో లోతుగా పాతుకు పోయిన ఝుమైర్ నృత్యం అంటే ఏంటంటే.. ఝుమైర్ నృత్యం అంటే.. ఝుమోయిర్ అనేది అస్సాంలోని టీ తెగ సంఘం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాల గిరిజనులు ప్రదర్శించే సంప్రదాయ జానపద నృత్యం. ఇది టీ తోట కార్మికుల రోజువారీ జీవితాలలో లోతుగా పాతుకుపోయింది. తరచుగా పండుగలు, పంటకోత వేడుకలు, సామాజిక సమావేశాల సమయంలో ప్రదర్శిస్తారు. చూడటానికి ముగ్ధమనోహరంగా డప్పుల దరువులకు అనుగుణంగా లయబద్ధమైన కదలికలతో కూడిన ఝుమైర్ నృత్యం ఇది. సంప్రదాయ మడోల్(డ్రమ్) లయబద్ధమైన దరువులు నడుమ టీతోటల శ్రమైక జీవుల కథలను శ్రావ్యమైన జానపద పాటలతో చెబుతారు. ఈ నృత్యాన్ని సమూహాలుగా చేస్తారు. ఒకరి నడుములు ఒకరు పట్టుకుని లయబద్ధమైన చప్పట్లు, డ్రమ్ లయలకు అణుగుణంగా పాదాలు కదుపుతారు. ఈ సాంస్కృతిక దృశ్య రూప నృత్యం టీ తోటల కార్మికుల ఐక్యత, సాముహిక స్ఫూర్తిని తెలియజేస్తుంది. అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ నృత్యాన్ని ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ప్రధాన మోదీ సమక్షంలో ప్రదర్శించనున్నారు. అంతేగాదు ఈ ప్రతిష్టాత్మక కళారూపానికి జాతీయ, ప్రపంచ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది అస్సాం రాష్ట్రం. అస్సాం గతంలో 2023లో ఇదే వేదికపై సుమారు 12 వేల మందికి పైగా నృత్యకారులతో రికార్డు స్థాయి బిహు నృత్య ప్రదర్శన ఇచ్చి చరిత్ర సృష్టించింది. మళ్లీ ఈసారి కూడా ఆ స్థాయిలో శాశ్వత ముద్రను వేసే దిశగా అగుడులు వేస్తున్నారు అస్సాం ప్రదర్శనకారులు.(చదవండి: నో ఛాన్స్ మోడల్ కాలేవంటూ తిరస్కారాలు..కానీ అతడే ఇవాళ..)
ఫొటోలు


కవ్వించే అందాలతో సంయుక్త మీనన్.. చీరకట్టులో మైమరిపిస్తోందిగా!


స్టైలిష్ లుక్‌లో సిమ్రాన్ శర్మ ఫొటోస్ .. డోస్ మీద డోస్


పెళ్లి వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దంపతులు.. ఫోటోలు షేర్ చేసిన నమ్రతా శిరోద్కర్ (ఫోటోలు)


ఫ్యామిలీతో కలిసి జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో మన్మధుడు హీరోయిన్ అన్షు (ఫోటోలు)


మైమరపించే అందాలతో రచ్చ చేస్తున్న నీహారిక కొణిదెల ఫొటోస్


తండేల్ సినిమా సక్సెస్ పార్టీ (ఫోటోలు)


చెల్లి హల్దీ ఫంక్షన్.. హరితేజ హంగామా చూశారా? (ఫోటోలు)


జబర్దస్త్ బ్యూటీతో డైరెక్టర్ తేజ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


HBD Nani: అసలు పేరు 'నాని' కాదు.. తొలి రెమ్యునరేషన్ 4 వేలు! (ఫోటోలు)


కవ్వింపులతో మైమరిపిస్తున్న మృణాళిని రవి ఫొటోస్.. ఫిదా అవ్వాల్సిందే!
National View all

తల్లి ఫోను లాక్కుందని.. 13 కి.మీ నడచివెళ్లి..
ఈ రోజుల్లో అందరూ ఫోనుకు బానిసలైపోతున్నారు.

మెట్రో–3 భూగర్భ రైళ్లకు తగ్గిన ఆదరణ
దాదర్: ముంబైలోని పశ్చిమ ఉప నగరాలతో ఉత్తర–దక్షిణ ప్రాంతాలను

Maha Kumbh: ఆఖరిరోజు పుణ్య స్నానాలకు ఎంత మంది అంటే..
ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవంగా పేరొందిన మహాకుంభ

Delhi: అసెంబ్లీలో హంగామా.. 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం(

‘ఆ గోధుమలతోనే జుట్టూడింది’
ముంబై: ఆ ప్రాంతంలోని ప్రజల్లో అకస్మాత్తుగా జట్టు రాలే సమస్య(Hair Loss) మొ
NRI View all

Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం
డాలస్ : ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం
శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతు ద
International View all

దూకుడు ఫలితం.. ట్రంప్ క్రేజ్‌కు బీటలు..?
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూక

గవర్నర్ రేసు..వివేక్ రామస్వామికి ట్రంప్ మద్దతు
వాషింగ్టన్:భారత సంతతికి చెందిన బయోటెక్ బిలియనీర్ వివేక్ర

వీడియో: చూస్తుండగానే ఘోరం.. కుప్పకూలిన బ్రిడ్జి
దక్షిణ కొరియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోగా.. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

బంగ్లాదేశ్‌కు జైశంకర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ:బంగ్లాదేశ్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర

మొత్తం ఖైదీల పరస్పర బదిలీకి సిద్ధం
కీవ్: రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు, ఇరుదేశాల్లో ఉన్న మొత
క్రైమ్

ఏడు అడుగులు.. ఏడేళ్ల వివాహేతర సంబంధం?
వరంగల్ క్రైం/ఖిలావరంగల్: వైద్యుడితో ఆమె ఏడడుగులు నడిచింది.. కానీ ఏడేళ్లనుంచి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఆ వివాహేతర సంబంధమే వారి కుటుంబంలో చిచ్చురేపింది. చివరికి భర్తను చంపేయాలన్న నిర్ణయానికి వచ్చింది. వరంగల్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 20వ తేదీ రాత్రి జరిగిన యువ వైద్యుడు గాదె సుమంత్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును విచారిస్తున్న పో లీసులకు కేసు పూర్వాపరాలు ఓ సినిమా స్టోరీని తలపించినట్లు తెలిసింది. భార్య, ప్రియుడు సూత్రధారులుగా తేల్చి అదుపులోకి తీసుకున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమ వివాహం..ఆపై వివాహేతర సంబంధం కాజీపేట మండలం ఫాతిమానగర్‌లోని ఓ చర్చిలో గాదె సుమంత్‌రెడ్డి, ఫ్లోరింజాలకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు వేసి జీవితాన్ని ప్రారంభించిన ఆ జంట మధ్య వివాహేతర సంబంధం సమస్యలను తెచ్చిపెట్టింది. ఫోరింజ 2019లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగం సాధించింది. దానికంటే ముందు సంగారెడ్డిలో డాక్టర్ సుమంత్‌రెడ్డి ఆస్పత్రి నిర్వహించే క్రమంలో జిమ్‌కు వెళ్లిన ఆమెకు అందులో ఉద్యోగం చేసే సామేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఆ తర్వాత ఆస్పత్రిని కాజీపేటకు మార్చారు. అయినా ఏడేళ్లుగా ఫోరింజ, సామేల్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇటీవల విషయం సుమంత్‌రెడ్డికి తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో సామేల్ .. ఫ్లోరింజలు కలిసి డాక్టర్‌ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. దీనికి సంగారెడ్డిలో ప్లాన్ చేసి, భట్టుపల్లి దగ్గరలోని అమ్మవారిపేట వద్ద అమలు చేశారు. దాడి అనంతరం పారిపోయిన నిందితులను పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. కాగా, వీరు అనేకసార్లు డాక్టర్‌పై దాడి ప్రయత్నాలు చేసి విఫలమైనట్లు తెలిసింది. ఓసారి డాక్టర్‌ను నేరుగా బెదిరించి వదిలేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి కోసం వచ్చి..ప్రియురాలు ఫ్లోరింజ కోసం హత్య చేయడానికి సిద్ధమైన సామేల్ వెంట వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్ అయ్యాడు. సుమంత్‌పై దాడి అనంతరం ఏఆర్ కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లో వదిలేసి సామేల్ బెంగళూరు పారిపోయాడు. కాల్ డేటా అధారంగా పోలీసులు నిందితులను త్వరగా పట్టుకోగలిగారు. ప్రాణాపాయ స్థితిలో వైద్యుడు సుమంత్ వైద్యుడు సుమంత్‌రెడ్డి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెడ, తలకు బలమైన గాయాలు కాగా, ప్రాణపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. కోడలిపై అనుమానం.. ఫిర్యాదు..డాక్టర్ సుమంత్‌రెడ్డిపై దాడి జరిగిన వెంటనే తల్లిదండ్రులు కోడలు ఫ్లోరింజాపై అనుమా నం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కాల్ డేటా వివరాలను పరిశీలించారు. అందులో కొన్ని నెలలుగా గంటల తరబడి మాట్లాడుతున్న ఫోన్ నంబర్, హత్యాయత్నం జరిగిన రోజు ఎక్కడ ఉంది అని చూశారు. హత్యాయత్నం జరిగిన సంఘటన స్థలానికి మ్యాచ్ అయినట్లు సమాచారం. దీంతో సూత్రధారి అయిన భార్యను అరెస్టు చేయకుండా ఫోన్‌నంబర్ అధారంగా పోలీసులు రెండు రోజులు బెంగళూర్‌లో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్‌కు తీసుకువచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించడంతో అసలు నిందితురాలిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపే అవకాశం ఉంది.

యువతిపై లైంగిక దాడి.. నిందితుడిపై కేసు నమోదు
సనత్‌నగర్(హైదరాబాద్): ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన యువతి (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్నేళ్ల క్రితం ఆమెకు బేగంపేట ప్రకాష్ నగర్‌కు చెందిన ఆర్యతో ఇన్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిరువురు తరచూ వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి సదరు యువతిని తన ఇంటికి తీసుకెళ్లిన ఆర్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అంతేగాగా ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసిన అతను తనను విడిచిపెట్టి వెళ్లాలని, లేని పక్షంలో ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాధితురాలు సోమవారం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై

రోహింగ్యాల వ్యవస్థీకృత వ్యభిచార దందా
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమంగా నగరానికి వలస వచ్చిన రోహింగ్యాలు వ్యవస్థీకృతంగా వ్యభిచార దందా కొనసాగిస్తున్నారు. తమ జాతీయతను దాచి పెట్టడానికి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకున్నారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పాతబస్తీతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం మెరుపు దాడులు చేశారు. 18 మందిని అదుపులోకి తీసుకుని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించారు. మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చిన ఈ రోహింగ్యాలు కోల్‌కతాలో నకిలీ ఆధార్ కార్డులు సంపాదించారు. వీటిని తయారు చేసి ఇచ్చిన వ్యక్తులు వారిని వెస్ట్‌బెంగాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిగా చూపించారు. ఈ ఆధార్ కార్డుల ఆధారంగా నగరానికి చేరుకున్న వీరు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో పురుషులు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి వాటి ఆధారంగా ట్యాక్సీ డ్రైవర్లుగా పని చేస్తుండగా... మహిళలు, యువతులు వ్యభిచార వృత్తిలో దిగారు. పరిచయస్తులతోనే ఈ దందా చేస్తున్న వారిని సంబందీకులైన పురుషులే తమ వాహనాలపై తీసుకెళ్లి కస్టమర్ల వద్ద వదిలి వస్తున్నారు. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ దందాపై దక్షిణ మండల టాస్‌్కఫోర్స్‌కు సమాచారం అందడంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో వరుస దాడులు చేసిన ప్రత్యేక బృందాలు మొత్తం 18 మందిని పట్టుకున్నాయి. వారి నుంచి వాహనాలు, నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోహింగ్యాల్లో కొందరిని చాదర్‌ఘాట్ పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.

డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం.. దారి తప్పిన భార్య కథ
సాక్షి, హైదరాబాద్ : వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. దంపతులిద్దరూ సమాజంలో గౌరవప్రదమైన డాక్టర్, లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లెక్చరర్‌గా విద్యాబుద్ధులు నేర్పించే భార్య పక్కదారి పట్టింది. దారుణానికి ఒడిగట్టింది. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం, అనుకున్నట్లుగా భర్త చనిపోకపోవడంతో చివరికి పోలీసులకు పట్టుబడింది. దోషిగా కటకటాల్లోకి వెళ్లనుంది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో అసలు సూత్రధారి, పాత్రదారి బాధితుడి భార్య ఫ్లోరా మరియా అని తేలడం అందర్నీ షాక్‌కు గురి చేసింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలీసుల వివరాల మేరకు, డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరా మరియాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాజీపేటలో సుమంత్ క్లినిక్‌ను నిర్వహిస్తుండగా, అతని భార్య ఫ్లోరా మరియా రంగశాయిపేటలో డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే, క్లినిక్ ప్రారంభించకముందు ఓ ఆస్పత్రిలో డాక్టర్‌గా సుమంత్ పనిచేసేవారు. ఆ సమయంలో ఫ్లోరా మరియా ఓ జిమ్‌లో చేరింది. అక్కడే ఆమెకు సామెల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. ఆ విషయం సుమంత్‌కు తెలిసిపోవడంతో భార్య ఫ్లోరాను మందలించాడు.అయినా, ఆమె వినిపించుకోలేదు. భర్తను వద్దనుకొని, ప్రియుడే కావాలని అనుకున్న ఆమె, చివరికి భర్తను అడ్డొదగొట్టాలని అనుకుంది. ఇందుకోసం ప్రియుడు సామెల్, అతని స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజును ఆమె పురమాయించింది. నేరం చేస్తే మట్టికి అంటకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో భర్తను ఎక్కడ, ఎలా హత్య చేయాలో ఫ్లోరా చెప్పింది.సుమంత్‌ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం, యాక్సిడెంట్ ప్లాన్ విఫలమయ్యాక, ప్లాన్ బీ ప్రకారం ఈ నెల 20న రాత్రి ఖాజీపేట నుండి బట్టుపల్లి బైపాస్ రహదారిలో సమంత్ కారును అడ్డగించి, అతడిపై ఐరన్ రాడ్లతో దాడి చేశారు. చనిపోయాడనుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కానీ చావుబతుకుల మధ్య ఉన్న బాధితుణ్ని స్థానికులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుమంత్‌పై జరిగిన హత్యాయత్నంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో కట్టుకున్న భార్య ఫ్లోరా మరియా, ఆమె ప్రియుడు సామెల్, సామెల్ స్నేహితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజు నిందితులని తేలింది. మంగళవారం నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరచి, హత్యయత్నానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
వీడియోలు


మరోసారి తొక్కిసలాట తిరుమలలో తీవ్ర విషాదం..


వరుదు కల్యాణి మాస్ ర్యాగింగ్!


72 గంటలు గడిచినా ఇంకా దొరకని 8 మంది ఆచూకీ


Ding Dong 2.O: కోతల రాయుళ్ళకి వాతలు మాయ చేసే నాయకులకు చురకలు


ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి YSRCPకి అన్ని అర్హతలు ఉన్నాయి


ఏమ్మా షర్మిలా... షర్మిలపై సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ప్రశాంతంగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాను తునిలో రెడ్ బుక్ పాలన


ఏపీ అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించిన చంద్రబాబు


కోల్‌కతా సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం


సాక్షి టీవీ సహా 4 ఛానళ్ల జర్నలిస్టులకు అనుమతి నిరాకరణ