యష్‌కు సర్‌ప్రైజ్‌ విషెస్‌.. | Watch, Ayra And Radhika Surprise Wishes To Yash | Sakshi
Sakshi News home page

యష్‌కు సర్‌ప్రైజ్‌ విషెస్‌..

Published Wed, Jan 8 2020 7:17 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

హీరో యష్‌ బుధవారం 34వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 చిత్ర బృందం కూడా ఆ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అయితే యష్‌ భార్య రాధిక, కుమార్తె అయిరా యష్‌కు సర్‌ప్రైజ్‌ బర్త్‌ డే విషేస్‌ తెలిపారు. యష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఆయనకు విషెస్‌ చెప్పిన రాధిక.. కుమార్తె అయిరా కలిసి కేక్‌ తయారు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. ‘సర్‌ప్రైజ్‌.. మేము నీ జీవితంలో చోటు సంపాదించుకున్నట్టే.. నీ అకౌంట్‌ను కూడా తీసుకున్నాం. బిగ్గెస్ట్‌ ఫ్యాన్స్‌ నుంచి వన్‌ అండ్‌ ఓన్లీ రాక్‌స్టార్‌కు హ్యాపీ బర్త్‌ డే’ అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో.. రాధిక కేక్‌ తయారు చేస్తూ యష్‌కు విషెస్‌ చెబుతుంటే.. అయిరా కేక్‌తో ఆడుకుంటూ క్యూట్‌ క్యూట్‌గా అల్లరి చేస్తుంది.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా, యష్‌, రాధికలు 2016లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి 2018లో అయిరా, గతేడాది బాబు జన్మించారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement