గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా తిరుపతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వచ్చారు. బోటు ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఆమె భర్త గల్లంతు అయ్యాడు. దీంతో భర్త ఆచూకీ కోసం మధులత కన్నీరుమున్నీరుగా విలపించింది.