జమ్మూకశ్మీర్ ముఖచిత్రాన్ని, తలరాతను నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిగా మార్చబోతోందని, అయితే, యువత తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. శ్రీనగర్‌లో గురువారం జరిగిన క్రీడా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ అంటే ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.