జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దవూర మండలం, పోతునూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు కానాపురం అజయ్, పోరుగు జయంత్, సంతోష్ రెడ్డిలుగా గుర్తించారు. నాగర్ కర్నూల్ వాసులైన వీరంతా వీకెండ్ ఎంజాయ్ కోసమని బందరు, బాపట్ల బీచ్‌లకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఇంటికి బయలు దేరగా.. పోతునూర్ స్టేజి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను నాగర్జున సాగర్ కమలా నెహ్రు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.