ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని లెక్కించడం ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్ అన్నారు. నామినేషన్‌కు ముందు అభ్యర్థులు చేసిన వ్యయాన్ని పార్టీల ఖర్చుల ఖాతాల్లోకి వెళ్తుందని చెప్పారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలు తర్వాత ఏడు రోజుల్లోగా తమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను సమర్పించాల్సి ఉం టుందని చెప్పారు. లేనిపక్షంలో స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చులను అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కింద లెక్కిస్తామన్నారు.