ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్‌ పేల్చిన చంద్రబాబు! | AP CM Chandrababu Comments on Three State Elections | Sakshi
Sakshi News home page

ఆ మూడు రాష్ట్రాలు.. మళ్లీ బాంబ్‌ పేల్చిన చంద్రబాబు!

Published Thu, Dec 13 2018 9:40 PM | Last Updated on Wed, Mar 20 2024 4:08 PM

తన ప్రచారంతో, అడ్డగోలు వ్యాఖ్యలతో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. తాజాగా విచిత్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలువడానికి టీడీపీనే కారణమంటూ ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కృషి వల్లనే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిందని ఆయన  చెప్పుకొచ్చారు. నిజానికి ఆ మూడు రాష్ట్రాల్లో చంద్రబాబు కనీసం ప్రచారం కూడా చేయలేదు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని.. ఆయన విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement