రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమించిన వారిపై నమోదైన అన్ని కేసులను ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఆర్.ఎం. కిశోర్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో ఆందోళన చేసిన వేలాది మందిపై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.