బీజేపీ నేత బండి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌టియుసి నేత మహబూబ్ బాషాపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడ్డారు. వివరాలు.. రవీంద్రనగర్‌లో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న వలంటీర్లను బీజేపీ నేతలు బెదిరిస్తుండగా మహబూబ్ బాషా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దని, అయినా తమ కాలనీలో మీకు తిరిగే అర్హత లేదంటూ బండి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు.