పామును చేతిలో పట్టుకున్న ప్రియాంకగాంధీ | Caught on camera! Priyanka Gandhi Vadra holds snakes in hand during poll campaign in Raebareli | Sakshi
Sakshi News home page

పామును చేతిలో పట్టుకున్న ప్రియాంకగాంధీ

Published Thu, May 2 2019 1:34 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ఎన్నికల ప్రచారంలో ప్రియాంకగాంధీ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం తన తల్లి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలిలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంకగాంధీ.. అన్ని వర్గాల ప్రజలను కలుసుకుంటూ.. వారి గురించి అడిగి తెలుసుకుంటూ.. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, అందరి అభ్యున్నతికి కృషిచేస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆమె రాయ్‌బరేలిలో పాములు ఆడించేవారిని కలుసుకొని వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు.. పాములను ఆమెకు చూపించగా.. ఆమె ఒక పామును చేతిలో పట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement