ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలపై అమిత్ షాతో సీఎం జగన్ చర్చించనున్నారు. రెండు రోజులు క్రితం ప్రధాని మోదీని కలిసిన ఆయన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి నిధులు కేటాయింపులోనూ చొరవ చూపించాలని ప్రధానిని కోరారు. దీనిపై సంబంధింత మంత్రులను కూడా కలిసి చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.