కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడూ.. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదని, ఆయన ఎవరితోనైనా కలుస్తారని విమర్శించారు. చంద్రబాబు అవకాశ రాజకీయాలను తాము సమర్థించాల్సిన అవసరం ఏంటని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం దారుణమన్నారు.