సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును డైరెక్ట్‌గా టార్గెట్ చేశారు. ఆదివారం గుంటూరులో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య సభలో నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చంద్రబాబే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.