ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రోజురోజుకు దిగజారి మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలను చూసి టీడీపీ అధినేత సహించలేకపోతున్నారని విమర్శించారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపట్ల మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.