మహాకూటమిగా ఎన్నికల్లో కలిసి వెళతామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియా అన్నారు. ఈ నెల 9 తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. ఎవరు ఆందోళన పడొద్దని, సీట్ల సర్దుబాటుపై ఎలాంటి సమస్య లేదన్నారు. గాంధీభవన్‌లో ఇండియన్ ముస్లిం లీగ్ నేతలతో కుంతియా సోమవారం భేటీ అయ్యారు.