ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతపైనే దాడి జరిగితే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు.