హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న జీబీఆర్ గార్డెన్‌లో నిర్వహించే ప్లీనరీలో ప్రతినిధులు కూర్చోవడానికి 9 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం కోసం వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇక నగరమంతటా హోర్డింగులు, కటౌట్లు, జెండాలతో గులాబీమయం చేశారు. ప్లీనరీ ప్రాంగణంలో ప్రతినిధుల నమోదు కోసం 34 నమోదు కేంద్రాలను ఏర్పాటు చేశారు.