టీఆర్‌ఎస్ ప్లీనరీలో ప్రతినిధులకు వడ్డించేందుకు పసందైన వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ప్రత్యేకంగా వండుకునే తలకాయ కూర, పాయా, మటన్ బిర్యానీ, మటన్ షోర్భా, నాటుకోడి కూర వంటి మాంసాహార వంటకాలను వడ్డించనున్నారు. శాఖాహారంలో దాల్చా, పచ్చి పులుసు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు ఇతర మాంసాహార, శాఖాహార వంటలూ సిద్ధం చేస్తున్నారు. ఇక ఎండల వేడి నేపథ్యంలో చల్ల (మజ్జిగ), అంబలిని కూడా అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికోసం ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయానికే వంటలన్నీ సిద్ధం చేయాలన్న యోచనతో గురువారం అర్ధరాత్రి నుంచే వంటకాల పని మొదలుపెట్టారు.