తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అహ్మదాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. సోమవారం మొతేరా స్టేడియంలో కిక్కిరిసిన జనాల మధ్య ఆయన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసల్లో ముంచెత్తడంతో పాటుగా.. భారతీయుల శక్తిసామర్థ్యాలను ట్రంప్ కొనియాడారు. ఇక భారతీయ సినిమాలు, క్రీడాకారుల గురించి కూడా.. ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.