ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్‌లు పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈఎస్‌ఐకి చెందిన ఇన్యూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ అరవింద్ రెడ్డి, కె.రామిరెడ్డి, కె. లిఖిత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వర హెల్త్‌కేర్ ఎండీగా కొనసాగుతున్న అరవింద్ రెడ్డి ఈఎస్‌ఐకి పరికరాలు సరఫరా చేసినట్లు డబ్బులు కాజేశారు.