బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాను అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం విశాఖ తీరానికి 235 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం నుంచే ఒడిశా వైపుగా ప్రయణిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాకు భారీ ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. బంగాళాగాతంలో అతి తీవ్ర తుపాన్‌గా మారిన ఫొని ప్రభావంతో ఉత్తర శ్రీకాకుళం, తీరప్రాంత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫొని తుపాన్ ప్రస్తుతం కాకినాడ నుంచి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఉంది. దీని ప్రభావంతో విశాఖపట్నం,తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.