ప్రభుత్వం మారింది.. ముఖ్యమంత్రి మారాడు.. కానీ ఆ రైతన్న సమస్య మాత్రం తీరలేదు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ఆ రైతన్న తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో చేసేదేమిలేక చివరకు కలెక్టర్ కాళ్లపై పడి తన గోడును వెల్లబోసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో ప్రతిఒక్కరి మనస్సును కదిలిస్తోంది. దేశానికి వ్యవసాయం వెన్నముక అని ప్రగాల్భాలు పలికే నేతలు.. వాటిని కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితం చేస్తున్నారు. నాయకుల అలక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యంతో అందరికి తిండి పెట్టే రైతన్న.. ఆ బుక్కెడు బువ్వ కోసం అధికారుల కాళ్లుపట్టుకుంటున్నాడు.
అమానుషం.. కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతన్న!
Published Mon, Dec 31 2018 5:24 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement