మంటల్లో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు | Fire in korangi forest in Tamilnadu | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు

Published Sun, Mar 11 2018 7:39 PM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM

తమిళనాడులోని తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపు 60 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక యువతి చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు.ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నానికి అంతరాయం కలుగుతోంది. సుమారు కిలోమీటర్‌ మేర మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి కలెక్టర్‌, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచార సంబంధాలు కట్‌ అవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement