జిల్లాలోని కవిటి మండలం మాణిక్యపురంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. దీంతో పది లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. ఫైరింజన్లు ప్రమాద ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. గ్రామస్థులు అందరూ కలసి మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.