భాష, బతుకు మధ్య అవినావభావ సంబంధం ఉందని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం రాత్రి ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... తెలుగు మహాసభలు భువనవిజయంలా సాగుతున్నాయని అన్నారు. గుండె నిండుగా తెలుగు పండుగ జరుగుతోందన్నారు.