వ్యవసాయ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారి పునరావాసం కోసం తగిన చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టారీతిన భూములు సేకరించడంపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టులు, ఇతర అవసరాల కోసం వ్యవసాయ భూములు సేకరించిన వ్యవహారంలో వాస్తవాలు చెబుతారా? లేదంటే మమ్మల్నే సూక్ష్మస్థాయి పరిశీలన చేయమంటారా అంటూ ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటివరకూ చేసిన భూ సేకరణ వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలు లేవంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన విశ్వసించే విధంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపి ప్రభుత్వానికి హైకోర్టు ఆల్టిమేటం
Published Tue, May 1 2018 12:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
Advertisement