వేదికపైనే.. నువ్వెంత అంటే నువ్వెంత! | Jagadish Reddy Vs Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

వేదికపైనే.. నువ్వెంత అంటే నువ్వెంత!

Published Sun, May 31 2020 6:04 PM | Last Updated on Thu, Mar 21 2024 8:42 PM

సాక్షి, నల్గొండ: తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఇద్దరు నేతలు బాహా బాహికి దిగారు. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా... వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్దానికి తెరలేపారు. ‘నువ్‌ పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌కుమార్‌పై మంత్రి జగష్‌ రెడ్డి సెటైర్‌ వేయగా.. ‘నువ్‌ మంత్రిగా ఉండడం జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ కౌంటర్ వేశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement