‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు పిల్లలను పంపించే అర్హురాలైన ప్రతి తల్లికి అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే విద్యార్ధులకూ అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని వివరించారు.