విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన గురువే లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కాకినాడ జేఎన్టీయూలో చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన వైవా పరీక్షల్లో ప్రొఫెసర్ బాబులు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ ఎంటెక్ ఈసీఈ ప్రథమ సంవత్సర విద్యార్థినులు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు