jntu professor
-
ఇదేంది..పంతులూ..!
కేపీహెచ్‌బీకాలనీ: నో పార్కింగ్ ఏరియాలో కారును పార్కు చేయవద్దన్నందుకు ఓ సెక్యూరిటీ గార్డును జేఎన్టీయూహెచ్ ప్రొఫెసర్ చితకబాదిన సంఘటన శనివారం జేఎన్టీయూ హెచ్లో చోటు చేసుకుంది. ఎంత దైర్యంరా నీకు నా కారునే పెట్టవద్దంటావా...నా కొడుకుతో వాగ్వాదానికి దిగుతావా అంటూ దుర్భాషలాడటమేగాకుండా ఎవడు పెట్టవద్దన్నాడో చెప్పాలంటూ ప్రిన్సిపాల్ ఛాంబర్ వరకు వెంటబడి మరీ కొట్టాడు. తోటి ఉద్యోగులు వారించినా వినకుండా చెప్పు తీసుకుని సెక్యూరిటీ గార్డుపై దాడికి యత్నించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే...జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల స్పందన బ్లాక్ ఎదుట వాహనాలు పార్కు చేయకుండా పార్కింగ్ ఏరియాలోనే పార్కు చేసేలా చూడాలన్న ప్రిన్సిపాల్ ఆదేశిస్తూ ప్రత్యేకంగా ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలుపకుండా సెక్యూరిటీ గార్డు కాశిరాములు విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఫిజిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు తనయుడు తన తల్లి సహా వర్సిటీకి వచ్చి నో పార్కింగ్ ఏరియాలో కారు నిలిపాడు. దీంతో సెక్యూరిటీ గార్డు కాశీరాం అందుకు అభ్యంతరం చెప్పడంతో తాను ప్రొఫెసర్ కొడుకునని, తనకే అడ్డు చెబుతావా అంటూ వాగ్వాదానికి దిగాడు. అతను వారించినా వినకుండా కారును పార్కుచేసిన ప్రొఫెసర్ తనయుడు లోపలికి వెళ్లి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోతూ బయటికి వచ్చిన ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు సెక్యూరిటీగార్డును అందరి ముందు బూతులు తిడుతూ మొఖంపై, మెడపై గాయాలయ్యేలా చితకబాదాడు. అంతేగాకుండా ప్రిన్సిపాల్ గదివరకూ కొట్టుకుంటూ తీసుకెళ్లాడు. సిబ్బంది వారించినా పట్టించుకోకుండా తన చెప్పు తీసి కొట్టేందుకు యత్నించాడు. చివరకు సెక్యూరిటీ గార్డు తనను క్షమించాలని, తప్పయిందంటూ వేడుకున్నాడు. తన కొడుకు కాళ్లు పట్టుకుంటే వదిలేస్తానని చెప్పడంతో కాశీరాములు ప్రొఫెసర్ కొడుకు కాళ్లు పట్టుకున్నాడు. అతను శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడంతో యూనివర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా గతంలోనూ వెంకటేశ్వరరావు సెక్యూరిటీ గార్డులను బూతులు తిట్టినా ఎవరూ పట్టించుకోలేదని, దీంతో మరింత రెచ్చిపోయి ఏకంగా భౌతికదాడులకు దిగుతున్నాడని ఆరోపించారు. ఈ విషయమై జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ యాదయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సంఘటన తమ దృష్టికి వచ్చిందని, అయితే ప్రిన్సిపాల్ నుంచి నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కాకినాడ జేఎన్టీయూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
-
సాగుకు సాంకేతికత జోడించాలి
బుక్కరాయసముద్రం (శింగనమల): మారిన పరిస్థితులకనుగుణంగా సాగులో సాంకేతికతను ఉపయోగిస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయని జేఎన్టీయూ(ఏ) ఫ్రొఫెసర్ డాక్టర్ హేమచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో కోర్డినేటర్ డాక్టర్ లక్ష్మిరెడ్డి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ‘‘సంకల్పంతో సిద్ధి’’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వర్షాలు లేక...వరుస కరువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాకు సాగునీరు లేక పొలాలన్నీ బీళ్లుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులు ఏ యూనివర్శిటీల్లో చదువుకోక పోయినా శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు ఆలోచనలకు దీటుగా విజ్ఞానం కలిగి ఉన్నారన్నారు. వారికి ఆధునిక టెక్నాలజీ గురించి అవగాహన కల్పిస్తే బంగారు పంటలు పండిస్తారన్నారు. ఆ దిశగా శాస్ర్తవేత్తలు కృషి చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రైతులకు సోలార్ సిస్టింలు అందజేస్తే విద్యుత్ లేకుండా పంటలు పండించుకోవచ్చన్నారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా రైతులకు వినిపించి రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీరామమూర్తి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్ డాక్టర్ ఎల్లమందారెడ్డి, నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏడీఆర్ డాక్టర్ గోపాల్‌రెడ్డి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ రవీంద్రారెడ్డి, రెడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర, కేవీకే శాస్త్రవేత్తలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
నిందితుల కాల్‌లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ !
-
నిందితుల కాల్‌లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ !
హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే సీఐడీ అదుపులో ఉన్న ఈ లీకేజీ సూత్రధారులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు. సీఐడీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంసెట్ నిర్వహించాలా లేక వద్దా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే నిందితుల కాల్‌లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ సహా.. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు.