హైదరాబాద్ : ఎంసెట్ - 2 పేపర్ లీకేజీపై సీఐడీ గురువారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఇప్పటికే సీఐడీ అదుపులో ఉన్న ఈ లీకేజీ సూత్రధారులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అదుపులో ఉన్న నిందితుల కాల్ లిస్ట్ ఆధారంగా అధికారులు దర్యాప్తును మమ్మరం చేశారు.
సీఐడీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎంసెట్ నిర్వహించాలా లేక వద్దా అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే నిందితుల కాల్లిస్టులో జేఎన్టీయూ ప్రొఫెసర్ సహా.. మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లు ఉన్నట్లు సీఐడీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు.