టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ | Kanna Lakshmi Narayana Slams Chandrababu | BJP Praja Avedana Sabha in Eluru | Sakshi
Sakshi News home page

టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ

Published Sat, Oct 6 2018 12:47 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

ఏపీలో కొంతమంది పన్ను ఎగవేతదారులపై ఐటీ దాడులు జరిగితే తెలుగు దొంగల పార్టీ ఉలిక్కిపడిందని ఎద్దేవా బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవిఎల్‌ సరసింహా రావు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ‘ప్రజా ఆవేదన ధర్నా’లో ఆయన మాట్లాడుతూ... ఏపీ సీఎం చంద్రబాబు నాయడు ప్రజల సమస్యల గురించి ఏనాడు కేబినెట్‌ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయలేదని.. కానీ ఐటీ దాడుల నేపథ్యంలో ఏం చేయాలని మీటింగ్‌ పెట్టడం సిగ్గుచేటన్నారు. నిన్న జరిగిన అత్యవసర సమావేశం మాఫియా మీటింగ్‌లా ఉందని దుయ్యబట్టారు. టీడీపీ అంటే రాజకీయ పార్టీనా లేక మాఫియా పార్టీనా అంటూ ప్రశ్నించారు. అవినీతిలో ప్రపంచంలోనే టీడీపీ అగ్రస్థానంలో ఉందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా లేక ముఖ్య‘కంత్రి’నా అంటూ ఎగతాళి చేశారు. ఎంత దొరికితే అంత దోచుకుందాం.. దొరక్కుండా పారిపోదాం అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement