ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్...ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వాన పత్రిక అందచేశారు. అనంతరం ఇరువురు ముఖ్యమంత్రులు కలసి లంచ్ చేయనున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్, సంతోష్, వినోద్ కుమార్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.
Published Mon, Jun 17 2019 3:03 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement