రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగి బంగారు తెలంగాణ కల సాకారం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం కేసీఆర్ నేటినుంచి మహారుద్ర సహస్ర చండీయాగం చేయనున్నా రు. శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామి ఆశీస్సులతో.. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఐదురోజుల పాటు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ ఐదురోజుల్లో చతుర్వేద, పురస్సర, మహారుద్ర సహస్ర చండీయాగాలు చేస్తారు. మొదటిరోజు ఈ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం గణపతి పూజ అనంతరం పుణ్యహవచనం, రుత్వికహవనం, యాగశాల ప్రవేశం, గోపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగుతాయి.