అధికారంలోకి వస్తే లక్షలోపు రుణమాఫీతో పాటు ప్రస్తుత ఫించన్లు రెట్టింపు చేస్తామని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించనప్పటి పరిస్థితులుకు తాజా పరిస్థితులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. మేనిఫెస్టో కమిటీకి అన్ని వర్గాల నుంచి మొత్తం 3500 విజ్ఞాపనలు వచ్చాయన్నారు.