కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో అభివృద్ధి చూసి విపక్షాలు భయపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మంగళవారమిక్కడ మాట్లాడుతూ..‘మమ‍్మల్ని తిడితేనే కాంగ్రెస్ నేతలకు పూట గడుస్తుంది. చివరకు మా పిల్లలను కూడా వదలడం లేదు. సీఎం కేసీఆర్‌ను, మా ఇంట్లో చిన్న పిల్లలను కూడా తిడుతున్నారు