రాజధానిలో భూ సేకరణ పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు మండలాల్లో 1,019 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం శుక్రవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళగిరి మండలంలోని నవులూరు–1, నవులూరు–2లో 153.3458 ఎకరాలు, కురగల్లులో 107.1852 ఎకరాలు, తాడేపల్లి మండలంలోని పెనుమాకలో 628.9255 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని లింగాయపాలెంలో 98.0575 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 32.2350 ఎకరాలు సేకరించనున్నట్లు అందులో పేర్కొంది. రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కింద మొత్తం 1,019.749 ఎకరాలు సేకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల 1,061 కుటుంబాలు ప్రభావితం అవుతాయని వెల్లడించారు.
భూసేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల
Published Sat, Dec 16 2017 7:12 AM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement