మరో రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి తుదిగడువు. దీంతో అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ప్రచారానికి కొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో అస్త్రశస్త్రాలను ఉపయోగించేందుకు సిద్దపడుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న బాడీగార్డ్, ముఖ్య అనుచరుడు గుర్మీత్ సింగ్ అలియాస్ షేరా శుక్రవారం శివసేనలో చేరారు.