మేరే ప్యారీ దేశ్ వాసియోం... అంటూ 130 కోట్లమంది భారతీయుల్ని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పలకరించారు. లోక్‌సభ ఎన్నికల ముందు విరామం ఇచ్చిన రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్‌కి తిరిగి శ్రీకారం చుట్టారు. ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రేడియో ద్వారా తొలిసారి తన మనసులోని మాటను దేశప్రజలతో పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నీటి సమస్యను మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. జలసంరక్షణకు కలసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు.