మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే రైతులకు విత్తనాల సమస్య వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విత్తనాల కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను గత ప్రభుత్వంలో పక్కదారి పట్టించారని ఆయన విమర్శించారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి రైతులకు విత్తనాల పంపిణీపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.